ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు దారిలో నీళ్లు కుమ్మరిస్తున్నారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఆదిలాబాద్: దుమ్ము లేవకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న దారిలో రోజుకు దాదాపు 1.5 లక్షల లీటర్ల నీళ్లు చల్లుతున్నట్లు సమాచారం. మోకాళ్ల నొప్పులు రాకుండా వైద్యుల సూచన మేరకు ఆయన మెటల్ రోడ్డుపై కాకుండా మట్టి బాటపై నడుస్తున్నారు. నవంబర్ 9వ తేదీ నుంచి ఈ విధానాన్ని పాటిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.

ప్రతి రోజు 5 వేల లీటర్ల సామర్థ్యం గల 12 వాటర్ ట్యాంకర్లను, 20 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు లారీ ట్యాంకర్లను నీటి కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాంకర్లు రోజుకు రెండు ట్రిప్పులు వేస్తున్నాయట. మెటల్ రోడ్డుకు పక్కన ఉన్న పొదలను తొలగించడానికి రెండు బ్లేడ్ ట్రాక్టర్లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. నీళ్లను రోడ్డు పక్కల ఉండే బోర్‌వెల్స్ నుంచి తెస్తున్నట్లు చెబుతున్నారు.

పాదయాత్ర చేరుకోవడానికి అర గంట ముందు నీళ్లు చల్లుతున్నారు. దాంతో దుమ్ముధూళీ రేగకుండా సాఫీగా ఉంటుంది. ప్రతి రోజూ పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి రోజు 15 కిలోమీటర్ల మేర నీళ్లతో బాటను తడుపుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బర్రా రాఘవరావు ఈ పనిచేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది.

స్థానిక రైతులు స్వచ్ఛందంగా నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట. తెలుగుదేశం నాయకులు పత్తిపాటి పుల్లారావు, అనగాని సత్యప్రసాద్, గరికపాటి మోహన్ రావు ఉచితంగా ట్రాక్టర్లను సమకూర్చారని సమాచారం. ట్రాక్టర్లకు రోజుకు దాదాపు 300 లీటర్ల డీజిల్ అవసరం అవుతోంది. ఆ రకంగా రోజుకు డీజిల్ కోసం 16 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని దక్కన్ క్రానికల్ రాసింది.

English summary
According to am English daily - Nearly 1.5 lakh litres of water is being used to ensure that TD chief N. Chandrababu Naidu’s padayatra is dust-free.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X