మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ.నగర్‌ రసవత్తరం: టిఆర్ఎస్‌కు బిజెపి ఛాలెంజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy-K Chandrasekhar Rao
రాష్ట్రంలో జరుగుతున్న ఏడు నియోజకవర్గాల్లోని ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో పోటీ విచిత్రంగా ఉంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. కేవలం మ.నగర్‌లో మాత్రం నాలుగు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ తెలంగాణవాదం వినిపిస్తున్న రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పోటీ పడటం గమనార్హం. తెలంగాణవాదం పేరుతో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సంప్రదాయ ఓటు బ్యాంకుతో కాంగ్రెసు, మాజీ మంత్రి, గ్రామాల్లో తమకు ఉన్న పట్టుతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. ఇక్కడ చతుర్ముఖ పోటీ రసవత్తరంగా మారింది. మహబూబ్ నగర్ పట్టణం, మహబూబ్ నగర్ రూరల్ మండలం, హన్వాడ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొదటి రెండు మండలాల్లో దాదాపు పట్టణ ప్రాంత ఓటర్లే ఉన్నారు. ఎన్నికల ఘట్టం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికి సమీకరణాలు మారాయి. మొదట తెలుగుదేశం పార్టీ మంచి ఊపుతో బరిలోకి దిగినప్పటికీ ఇప్పుడు కష్టపడాల్సి వస్తోంది.

పట్టణ ప్రాంత ఓటర్లలో ప్రధానంగా బిజెపి, టిఆర్ఎస్ వైపు మొగ్గు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ ఓటు కారణంగా కాంగ్రెసు, టిడిపిలు ముందున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు అభివృద్ధి ముఖ్యమని కాంగ్రెసు చెబుతుండగా, తెలంగాణకు తమ పార్టీ అడ్డు కాదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని టిడిపి చెబుతోంది. ఇక టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చేది మేమే అని చెబుతుండగా, బిజెపి ఒక అడుగు ముందుకేసి ఒక్కచోట టిఆర్ఎస్ ఓడినా ఉద్యమానికి వచ్చే నష్టమేమీ లేదని, మిగిలిన చోట్ల వారికి మేం మద్దతు ఇస్తున్నాని, మ.నగర్‌లో బిజెపిని గెలిపించి జాతీయస్థాయిలో కాంగ్రెసుకు కనువిప్పు కలిగించాలని ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెసు ఇవ్వని పక్షంలో తెలంగాణ ఇచ్చేది మేమే అని చెబుతున్నారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్‌పై ఆధిపత్యం కోసం ఇరు పార్టీ మధ్య హోరా హోరి నడుస్తోంది.

టిఆర్ఎస్ తరఫున మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ వర్గం ఓట్లు ఆ పార్టీకి గణనీయంగా పడే అవకాశముందని అంటున్నారు. అయితే కాంగ్రెసు, టిడిపికి ఉన్న ఆ వర్గం సంప్రదాయ ఓటర్లు మొగ్గితేనే అది జరుగుతుంది. టిఆర్ఎస్‌కు జమాతే ఇస్లామీ హింద్ మద్దతు పలికింది. ఈ పరిస్థితితో మరో వర్గం ఓటర్లు బిజెపి వైపు మొగ్గుతున్నారని అంటున్నారు. జెఏసి, విద్యార్థులు తదితరులు జాతీయ పార్టీ అయిన తమ పార్టీ వైపే ఉన్నారని బిజెపి చెబుతోంది. స్థానిక జిల్లా జెఏసి ఇప్పటికే బిజెపి, టిఆర్ఎస్‌లలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని, ఆ ప్రకారమే అవి పని చేస్తున్నాయని అంటున్నారు.

English summary
BJP is challenging TRS in Mahabubnagar constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X