వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం సిండికేట్లు, ప్రధానితో బొత్స భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు చేయడం, ఇందుకు సంబందించి కొంత మందిని అరెస్టు చేయడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మద్యం సిండికేట్లతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణను అదుపులో పెట్టడానికి మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలవనున్నారు.

పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత బొత్స సత్యనారాయణ ప్రధానిని కలుసుకోలేదు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన ప్రధానిని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆజాద్‌తో సమావేశమవుతారు. ఆజాద్‌తో మద్యం సిండికేట్లపైనే కాకుండా విగ్రహాల విధ్వంసంపై, తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం రాజకీయ రంగును పులుముకుంది. ఈ విగ్రహాల విధ్వంసం వెనక కాంగ్రెసు పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే, యానాం ఘటన కూడా కలకలం రేగుతోంది. యానాం రీజెన్సీ సిరామిక్స్‌ ఘటనలో కార్మిక నాయకుడు మురళీమోహన్, సంస్థ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి కార్మిక నాయకుల సంఘం గౌరవాధ్యక్షుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్నింటిపై బొత్స సత్యనారాయణ ఆజాద్‌కు వివరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that PCC president Botsa Satyanarayana may explain to Ghulam Nabi Azad on liquoe syndicates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X