హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అరెస్ట్‌కు మూడుసార్లు ప్రయత్నించిన సిబిఐ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-CBI
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ మూడుసార్లు ప్రయత్నించి విఫలమైందని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. శనివారం జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో జగన్‌ను ఎ-1గా సిబిఐ పేర్కొంది. దీంతో జగన్ అరెస్టు అవుతారా? అయితే ఎప్పుడవుతారు? అనే ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. ప్రమాదంలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత ఆయన మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని జగన్ ఓదార్చుతున్నారు. జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ఆయన చుట్టు పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు ఉంటున్నారు. జగన్ అరెస్టును అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఉంటున్నారని అనుమానిస్తున్నారు. అయితే వివిధ సందర్భాలలో జగన్‌ను అరెస్టు చేసేందుకు సిబిఐ మూడుసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదని ఆ పత్రిక రాసింది.

శనివారం ఛార్జీషీట్ దాఖలు దాఖలు చేసిన తర్వాత అరెస్టు ఉంటుందేమోననే అనుమానంతో జగన్ వర్గంలోని మేనేజర్లు, ఆయన మద్దతుదారులకు వెంటనే గుంటూరులో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ వద్దకు వెళ్లి ఆయన చుట్టూ వలయంలో ఏర్పడాలని సూచించారట. వచ్చే వారం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులతో జగన్ ఓదార్పు నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జగన్‌ను అరెస్టు చేసేందుకు సిబిఐ యత్నించిందట. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు జగన్ జనవరిలో వచ్చారు. అతడు తిరిగి వెళ్లే సమయంలో అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నించిందట. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారట. గత నెల మార్చి నాలుగో తేదిన కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు జగన్ వస్తున్నాడని తెలిసి సిబిఐ మరోసారి ప్రయత్నించినప్పటికీ ఆ విషయాన్ని తెలుసుకున్న జగన్ దానిని రద్దు చేసుకున్నారని పేర్కొంది.

English summary
With a chargesheet filed against Jaganmohan Reddy, there is intense speculation about whether he would be arrested and if when. Jagan, aware of such a possibility, has taken recourse to a novel way to ward off the arrest. He has been on an Odarpu Yatra, officially an exercise to console the families of people who committed suicide following his father's death in a copter crash, but actually a continuous political jamboree that is taking him across the state for the last one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X