హైదరాబాద్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తే ఎంత బెనిఫిటో తెలుసా!

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పని చెయ్యాలని ముఖ్య సూచనలు చేశారు. పశ్చిమాసియా (ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా) యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి భారత్‌పై ఆర్థికఒత్తిడి పెరగడంతో మన దేశ ఆర్ధికస్థితి ప్రభావితం అవుతుందని, అలాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బోలెడు లాభాలు

అయితే ఈ సూచన ఏ మేరకు హైదరాబాద్ కు లబ్ది చేకూరుస్తుందో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో రోజూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు వర్క్ ఫ్రమ్ హోం విధానం పరిష్కారంగా కనిపిస్తుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తృతంగా అమలు చేస్తే భారీ మొత్తంలో పెట్రోల్ ఆదా అవుతుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాకుండా, పర్యావరణ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది.

Work from Home facilities within the Hyderabad IT corridor would result in massive savings on petrol

ఐటీ హబ్‌లో సుమారు 9 లక్షల మంది ఉద్యోగులు

ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ హబ్‌లో సుమారు 9 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంత బైకులు, కార్లలో ఆఫీసుకు వెళ్లి వస్తుంటారు. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, రాజేంద్రనగర్ వంటి ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీంతో ఇంధనం వృథా అవడంతో పాటు, సమయం కూడా వృధా అవుతుంది.

రోజుకు 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా

ఒకవేళ ఈ 9 లక్షల మందిలో సగం మందికి అంటే 4.5 లక్షల మంది ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తే, రోజుకు 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుందని అంచనా వేయబడింది. ప్రస్తుత పెట్రోల్ ధర లీటర్‌కు సుమారు రూ.107.50గా ఉండగా, ఈ ఆదా ద్వారా రోజుకు దాదాపు రూ.3.87 కోట్ల మేర ఆర్థిక లాభం వస్తుంది.

లీటర్ పెట్రోల్‌కు సగటు 25 కిలోమీటర్ల మైలేజీ

ఒక సాధారణ ఉద్యోగి సగటున 20 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేస్తాడని లెక్కిస్తే, 4.5 లక్షల మంది ఇంటి నుంచి పని చేస్తే రోజుకు 90 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుంది. లీటర్ పెట్రోల్‌కు సగటు 25 కిలోమీటర్ల మైలేజీ ఉంటే ఈ లెక్కలు సరిపోతాయి. ఇంధన ఆదాతో పాటు, కార్బన్ ఉద్గారాలు తగ్గి వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.

వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనూ మెరుగైన పనితీరు

WFH వల్ల ఉద్యోగులకు సమయం ఆదా అవడంతో పాటు, మానసిక ఒత్తిడి తగ్గి పని సామర్థ్యం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఆఫీసు సంస్కృతిని కాపాడాలని ఆఫీసు హాజరీపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనూ మెరుగైన పనితీరును ఉద్యోగులు కరోనా సమయంలో చూపించారు.

బాచుపల్లి జంక్షన్‌ ఫ్లైఓవర్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలోనే ప్రారంభం!
బాచుపల్లి జంక్షన్‌ ఫ్లైఓవర్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలోనే ప్రారంభం!

WFH వంటి ఆధునిక పద్ధతులు ఈ దిశలో ముఖ్యమైన మార్పు

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చాలంటే ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన ఆదా, పర్యావరణ రక్షణ అనే అంశాలపై ప్రభుత్వం, కంపెనీలు, ఉద్యోగులు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. WFH వంటి ఆధునిక పద్ధతులు ఈ దిశలో ముఖ్యమైన మార్పు తీసుకురాగలవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+