బెంగాల్ సీఎం సువేందు సంచలన నిర్ణయం, మమతా బెనర్జీ 'ఫిక్స్'..!!
బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎన్నికల్లో టీఎంసీ పైన బీజేపీ విజయంలో సువేందు కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వరుసగా ఆసక్తి కర నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. మమత రాజకీయ వ్యూహాల పై పూర్తి అవగాహన ఉన్న సువేందు.. ఆపరేషన్ టీఎంసీ ప్రారంభించారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు మరో కీలక నిర్ణయం వెల్లడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఎంసీని బీజేపీ ఊహించని దెబ్బ తీసింది. టీఎంసీతో సహా మమతా బెనర్జీని భవానీపూర్ నుంచి ఓడించారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమతను ఓడించిన సువేందు.. తాజా ఎన్నికల్లో భవానీపూర్ లోనూ మమత పై విజయం సాధించారు. ఇక.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీఎంసీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా.. ఇప్పుడు నందిగ్రామ్ తో పాటుగా భవానీపూర్ నుంచి గెలిచిన సువేందు అధికారి.. తాను భవానీ పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతానని... నందిగ్రామ్ స్థానం కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. గతంలో మమతా గెలిచిన రెండు నియోజకవర్గాల్లో సువేందు గెలిచారు. ఇప్పుడు నందిగ్రామ్ కు రాజీనామా చేయటంతో మమతా ఆ స్థానం పైన ఫోకస్ చేస్తున్నారు.

సువేందు వ్యూహాత్మక అడుగులు
కాగా, ఇక్కడే సువేందు కీలక అడుగులు వేస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాను రాజీనామా చేస్తున్న ఈ స్థానం నుంచి గతంలో ఇదే నియోజకవర్గంలో మమత కు మద్దతు దారుడి గా నియోజకవర్గ బాధ్యతలు పర్యవేక్షించిన టీఎంసీ నేతకు బీజేపీ సీటు ఇప్పించేందుకు సువేందు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. మమతా ఈ స్థానం నుంచి పోటీకి దిగుతారా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు సువేందు రాజీనామా తో నందిగ్రామ్ కు ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ ఎన్నిక సువేందు తో సహా మరోసారి మమతకు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. మమతా అక్కడి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. సువేందు పూర్తి లెక్కలు సెట్ చేసుకున్న తరువాతనే నందిగ్రామ్ కు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో... ఇప్పుడు మమత తదుపరి నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications