వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స వద్దు కిరణే ముద్దు: రూటుమార్చిన చిరు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు క్రమంగా దూరమవుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి కాంగ్రెసులో చేరినప్పటి నుండి బొత్సతో సఖ్యతగా ఉంటూ, కిరణ్‌కు దూరంగా ఉంటున్నారన్న వాదనలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే చిరంజీవి క్రమంగా బొత్సకు దూరమవుతూ, సిఎంకు దగ్గరవుతున్నారనే చెప్పవచ్చు. కాపులలో బలం ఉన్న చిరంజీవిని అడ్డుపెట్టుకొని, తన బిసి కార్డుతో కాపు స్నేహ బంధాన్ని మిళితం చేసి ముఖ్యమంత్రి కావాలని దూకుడుగా వెళుతోన్న బొత్సకు చిరు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. బొత్స నీడన ఉంటే తాను ఏ పని చేసినా ఆయన కారణంగానే చేస్తున్నాననే ప్రచారం జరుగుతోందని, ఇటీవల ఆయనతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కూల్చేసే ప్రయత్నాల్లో భాగస్వామి కూడా అయ్యారన్న ప్రచారంపై చిరు ఒకింత అసంతృప్తితో ఉన్నారట.

అంతేకాకుండా కాకుండా బొత్సతో ఉంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతగా మిగిలిపోతాననే భావన ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. ఇలా అయితే తన రాజకీయ జీవితానికే ప్రమాదమని చిరంజీవి భావిస్తున్నారని అంటున్నారు. మరోవైపు తన వర్గం నేతలకు పార్టీలో సరైన న్యాయం చేయాలంటే కిరణ్‌తో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆయన భావించినట్లుగా సమాచారం. బొత్సతో ఉన్నప్పుడు తన వర్గానికి ఏమీ చేయలేక పోయానని, మంత్రి పదవులు అధిష్టానం హామీ మేరకే వచ్చినప్పటికీ, కిరణ్‌తో సఖ్యత లేకపోవడం వల్ల తన వర్గానికి చెందిన మంత్రులకు కోరిన శాఖలు ఇప్పించుకోలేక పోయానని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఆ తర్వాత మాత్రం చిరంజీవి సమాచార హక్కు చట్టం కమిషనర్ల జాబితాలో తాను సిఫార్సు చేసిన వారి పేర్లు చోటు చేసుకోవడం, మేడారం జాతరకు ముఖ్యమంత్రితో కలిసి వెళ్లడం వంటి సందర్భాలను గుర్తు చేస్తున్న రాజకీయ పరిశీలకులు చిరంజీవి క్రమంగా సిఎంకు దగ్గరవుతున్నారని అంటున్నారు.

మరోవైపు కిరణ్ కూడా తనకు చిరంజీవి సహకారం అవసరమని భావిస్తున్నారని అంటున్నారు. చిరంజీవికి జనంలో ఉన్న గ్లామర్, పార్టీ నాయకత్వం ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం, వీటికి మించి చిరు సమన్వయ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఆయనతో సఖ్యతగా ఉండటమే మంచిదని కిరణ్ యోచిస్తున్నారట. చిరుతో విభేదిస్తే సాధించేది ఏమీ ఉండదని, అందుకే ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. చిరంజీవి తన వైపు ఉంటే బొత్స ప్రాధాన్యత తగ్గుతుందని కూడా ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.

English summary
It seems, Tirupati MLA Chiranjeevi is moving very close to CM Kiran Kumar Reddy now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X