తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సీటు కోసం కాంగ్రెసులో పోటాపోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి రాజీనామా వల్ల ఖాళీ అయ్యే తిరుపతి శానససభా నియోజకవర్గం టికెట్ కోసం కాంగ్రెసు నాయకుల్లో పోటీ తీవ్రంగా ఉంది. రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి ఈ నెల 29వ తేదీన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఈ తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారనుంది. తిరుపతి నియోజకవర్గాన్ని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవి సూచించినవారికే కేటాయించవచ్చునని తొలుత ప్రచారం జరిగింది. చిరంజీవి భార్య సురేఖ గానీ సోదరుడు నాగబాబు గానీ తిరుపతి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, తిరుపతి నుంచి తన కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని, తాను ఎవరి పేరునూ సూచించడం లేదని చిరంజీవి చెప్పారు. దీంతో ఆ సీటు కోసం కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు పోటీ పడుతున్నారు.

తన మనిషి ఎంపి ప్రసాద్‌కు తుడా చైర్మన్ పదవి ఇవ్వాలని, రాజంపేట పార్లమెంటు సీటు తన వర్గానికి చెందిన వరప్రసాద్‌కు ఇవ్వాలని చిరంజీవి కోరుతున్నట్లు సమాచారం. వాటి సంగతెలా ఉన్నా తిరుపతి శానససభా నియోజకవర్గం సీటు కోసం కాంగ్రెసు నాయకులు మాత్రం పట్టుపడుతున్నారు. తిరుపతి నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా తన కుమారుడు జయదేవ్ పోటీ చేస్తారని మంత్రి గల్లా అరుణ కుమారి ప్రకటిస్తూనే ఉన్నారు. తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గల్లా జయదేవ్ కూడా అంటున్నారు. తన కుమారుడిని పోటీ చేయించే విషయంలో గల్లా అరుణ కుమారి గట్టిగానే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, మాజీ వెంకటరమణకు టికెట్ ఇవ్వాలని పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ కోరుతున్నట్లు సమాచారం. ఆయకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. అయితే, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి చదలవాడ కృష్ణమూర్తి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

English summary

 Congressmen are lobbying for party ticket to contest from Tirupati assembly seat, which will be vacated by Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X