వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు నోటీసులపై ఎమ్మెల్యేల్లో ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులపై కాంగ్రెసు శానససభ్యులు కలవరం చెందుతున్నారు. మంత్రులకు, ఐఎఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయంపై ప్రభుత్వం సమర్థంగా స్పందించడం లేదని శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని వారు నిర్ణయించుకున్నారు. ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో ఉండటంతో మంత్రి రఘువీరారెడ్డిని ఆయన చాంబర్‌లో బుధవారం కలిశారు. ఈ మేరకు మల్లాది విష్ణు, సుధాకర్‌తో పాటు దాదాపు 20మంది తమ ఆందోళనను తెలిపారు.

సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని చిన్న విషయంగా చూస్తున్నారా అని వారు మంత్రిని అడిగారు. మంత్రులు, అధికారులు వ్యక్తిగతంగా సమాధానాలు ఇచ్చుకుంటారనే పద్ధతిలో వ్యవహరించడం పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని వారడిగారు. జగన్ వేయించిన కేసు వల్ల ఈ పరిస్థితి వచ్చిందని రఘువీరా రెడ్డి అన్నట్లు సమాచారం. ఈ సమయంలో ఆవేశం వద్దని కొత్త ఎమ్మెల్యేలను రఘువీరా వారించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కన్పించట్లేదని.. దాన్ని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఉందని రఘువీరా సూచించారు. ఇందులో భాగంగా కొత్త ఎమ్మెల్యేలంతా కలసి బస్సు యాత్రను చేపట్టాలని సలహా ఇచ్చారు.

శాసనసభ శీతాకాల సమావేశాల్లో చంద్రబాబు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి జగన్‌వర్గ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే బాబు నీతిమంతుడిగా బయటపడే విధంగా న్యాయస్థానంలో జగన్ కేసు వేశారని వివరించారు. ఇప్పుడు జగన్ వేసిన కేసుపై సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసిన వెంటనే మంత్రులు రాజీనామా చేయాలంటూ తెలుగుదేశం గొడవ చేస్తోందని, ఇదంతా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే జరుగుతోందని ప్రజలకు తెలియజెప్పాలని రఘువీరా సూచించారు.

English summary
About 20 MLAs met senior minister Raghuveera Reddy and expressed their concern on notices issued to ministers by supreme court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X