వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఆర్ అసంతృప్తి: చిరంజీవి మనసులోని మాటలా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి వర్గం దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఆదివారం తిరుపతిలో సొంత పార్టీ అయిన కాంగ్రెసుపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అయితే రామచంద్రయ్య వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక చిరంజీవి మనసులోని మాటలా అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. చిరంజీవికి తెలియకుండా ఆయన ఇలాంటి కఠిన వ్యాఖ్యలు చేయరనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ తన వర్గంలో మంత్రి పదవులు ఇరువురికే ఇవ్వజూపినప్పుడు చిరంజీవి ఏరికోరి రామచంద్రయ్యకు ఇప్పించుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు విషయంలో కాంగ్రెసు నేతల నుండి అంత వ్యతిరేకత రాకపోయినప్పటికీ రామచంద్రయ్యకు మంత్రి పదవి అనడంతో ఆయన జిల్లా నేతలతో పాటు మండలి నేతలు, పలువురు కాంగ్రెసు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పార్టీ ఖాళీ అవుతుందని కూడా పలువురు హెచ్చరించారు. అయితే వాటన్నింటిని అధిగమించి రామచంద్రయ్యకు చిరంజీవి మంత్రి పదవి ఇప్పించుకున్నారు. రామచంద్రయ్య వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అలాంటి రామచంద్రయ్య చిరుకు తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని అంటున్నారు. కాంగ్రెసు తరఫున రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి.. అందుకు కృతజ్ఞతలు చెప్పడానికి శనివారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు కేంద్రంలో కెబినెట్ మంత్రి పదవి కాకుండా సహాయ మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున దానికీ కాస్త సమయం పడుతుందని అన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విలీనం సమయంలో ఓ మాట ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెసు పెద్దల వైఖరిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తే రామచంద్రయ్య ద్వారా వ్యక్తమైనట్లు పలువురు భావిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో చిరు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొని, ఆయన వెళ్లిన అనంతరం రామచంద్రయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏదో ఫ్లోలో అన్నాను అంటూ ఆ తర్వాత చెప్పారు.

English summary
The rumors were came out that minister C Ramachandraiah unhappy on Congress is Tirupati MLA Chiranjeevi's opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X