'నామినేట్‌'తో అసమ్మతికి చెక్: కిరణ్ వ్యూహం

Kiran Kumar Reddy
రాష్ట్ర కాంగ్రెసులో కొలువుల జాతర ప్రారంభం కానుంది! నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం కాంగ్రెసు పార్టీలో కొత్త ఊపు తీసుకు వస్తుందా చూడాలి. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ నిస్తేజంగా మారింది. పార్టీలో కొత్త ఊపును తీసుకు వచ్చేందుకు నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పలువురు సీనియర్‌లు పలుమార్లు ప్రభుత్వానికి సూచించారు. అయితే పరిస్థితుల నేపథ్యంలో అది జరగలేదు.

అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఊపినట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని భావిస్తున్నారు. ఆరేడేళ్ల తర్వాత తొలిసారి పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతోంది. నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యేలకే దక్కుతాయని భావించినప్పటికీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలనే యోచనలో ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ నామినేటెడ్ పదవులు ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. దశలవారీగా భర్తీ చేయడమే మంచిదని కిరణ్ భావిస్తున్నారట. పదవులను ఆశిస్తున్న వారి జాబితా ఇప్పటికే జిల్లాల వారిగా రాజధానికి చేరుకున్నాయి. పలువురు ఆశావహులు కూడా కిరణ్, బొత్సలకు విజ్ఞప్తులు చేసుకున్నారు. చైర్మన్ పదవులు తక్కువగా ఉండటంతో ఈ పోస్టులను నేతలకు అప్పగించి వాటిలోని డైరెక్టర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రతి నియోజకవర్గం ప్రతినిధులు ఉండేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారట.

ప్రతి నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులో ఒకరినైనా నియమిస్తే కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను గుర్తించి పదవులు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఆయన అధిష్టానం అనుమతి తీసుకొని దసరా లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా అసమ్మతిని కూడా ఎదుర్కోవడానికి అవకాశముంటుందని కిరణ్ భావిస్తున్నారని తెలుస్తోంది. తొలి జాబితా ఇప్పటి వరకే సిద్ధమైందనే వార్తలు కూడా వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+