యుపిలో మాయావతికి ఎదురు దెబ్బ?

అలాగే, కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకాక తప్పదని ఎన్నికల సర్వే ద్వారా తెలుస్తోంది. స్టార్ న్యూస్-నీల్సన్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. గత నెల 4 నుంచి 20వ తేదీల మధ్య కాలంలో 202 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. 403 నియోజకవర్గాలున్న యూపీలో మరో నాలుగు రోజుల్లో తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఈ తాజా సర్వే ప్రకారం - ఎస్పీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 101 సీట్లు గెల్చుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాకే పరిమితంకానుంది. గత రెండు దశాబ్దాలుగా ఏ మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ 79 సీట్లతో మూడో పెద్ద పార్టీగా అవతరించనుంది. ఆర్ఎల్‌డితో పొత్తు కూడా కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఆర్‌ఎల్‌డి 20 సీట్లు గెలుచుకుంటుందని అంచనా.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టంగా 22 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవడానికి రాహుల్ గాంధీ పడిన శ్రమ కొంతమేరకు ఫలించే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో 51 సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఈ దఫా పది సీట్లను అదనంగా తన ఖాతాలో వేసుకుని 61 సీట్లను కైవసం చేసుకోనుంది. అలాగే, ఆర్ఎల్‌డి పార్టీ తన సీట్ల సంఖ్యను 10 నుంచి 20కు పెంచుకోనుంది. ఇతర పార్టీలు పెంచుకునే సీట్లన్నీ మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ నుంచే జారిపోయే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మాయావతి బఎస్పీ 207 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది.












Click it and Unblock the Notifications