వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం: పురంధేశ్వరి హడావిడి ఉత్తదేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనకు లోకసభ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర మంత్రి, ఆయన కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి చేస్తున్న హడావిడి అంతా ఉత్తదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు ఆ సందేహాలకు కారణమవుతున్నాయి. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు లోకసభ తనకు అనుమతి ఇచ్చిందని పురంధేశ్వరి చెప్పుకున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెకు వ్యతిరేకంగా అవతలి వైపు చురుగ్గా కదులుతున్నారు.

ఎన్టీఆర్ విగ్రహం ఇవ్వడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో అటువంటి అనుమతి ఏదీ ఇవ్వలేదని లోకసభ స్పీకర్ సచివాలయం చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. స్పీకర్ మీరా కుమార్ నుంచి తనకు లేఖ అందిందని పురంధేశ్వరి నుంచి చెప్పుకుంటున్నారు. అయితే, తమ కార్యాలయం నుంచి రెండు నెలల క్రితం ఎన్టీఆర్ విగ్రహ ప్రతస్థాపన కోసం కుటుంబ సభ్యుల అనుమతితో ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీకి, పురంధేశ్వరికి లేఖలు రాసినట్లు తమకు స్పీకర్ కార్యాలయ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

ఎన్టీ రామారావు విగ్రహాన్ని పార్లమెంటులో నెలకొల్పడానికి స్పీకర్ కార్యాలయం సిద్ధంగానే ఉంది. అయితే, ఎన్టీఆర్ కుమారులు ఏడుగురు, కూతుళ్లు నలుగురు - మొత్తం 11 మంది సంతానం ఏకాభిప్రాయంతో రావాలని స్పీకర్ సచివాలయం అడిగింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పది మంది ఎన్టీఆర్ సంతానం ఒక వైపు ఉండగా, కూతురు పురంధేశ్వరి మరో వైపు ఉన్నారు. పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎవరికి దక్కాలనే విషయంపై రెండు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది.

ఎవరో ఒక్కరికి అనుమతి ఇచ్చే ప్రశ్న లేదని, కుటుంబ సభ్యులందరి సంతకాలతో ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీకి, పురంధేశ్వరికి గతంలో లేఖలు రాసినట్లు తెలుస్తోంది. అటువంటి అనుమతితో ఎవరూ ముందుకు రాలేదని స్పీకర్ కార్యాలయానికి రాలేదని ఆ పత్రిక రాసింది. అయితే, రెండు విగ్రహ నమూనాలతో పురంధేశ్వరి స్పీకర్ కార్యాలయానికి వచ్చారని అంటున్నారు. మొత్తం మీద, పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన వివాదం పతాక స్థాయికి చేరుకున్నట్లే ఉంది.

English summary

 According to reports - Union minister and daughter Daggubati Purandeswari claiming that she has been authorised by the Lok Sabha Speaker to go ahead with the installation and the Telugu Desam Party (TDP) calling it a bluff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X