• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నువ్వా-నేనా: ఒబామావైపు మొగ్గు, 'శాండీ' ప్లస్

By Srinivas
|
Romne\y-Barack Obama
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా అందరూ దృష్టి సారిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు జరిగే ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నేడు(మంగళవారం) జరిగే పోరుకు అంతా సిద్ధమైంది. దాదాపు సంవత్సరంన్నరగా సాగుతున్న ప్రచార హోరు గత రెండు రోజులుగా ఉధృతంగా మారింది. బరాక్ ఒబామా - రోమ్నీ ఎవరికి వారే ఓటర్లను ఆకర్షించేందుకు తమ తమ ప్రయత్నాలు చేశారు.

దీంతో శ్వేతసౌధంలో ఒబామా రెండోసారి అడుగుపెడతారా.. రోమ్నీ పీఠాన్ని కైవసం చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ కంటే ఒబామా స్వల్ప ఆధిక్యంతో ఉన్నా, ఇద్దరి మధ్య పోటీ అత్యంత తీవ్రంగా ఉండే అవకాశాలున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రత్యర్థి ఓటుబ్యాంకును కొల్లగొట్టాలని విశ్వప్రయత్నాలు చేశారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఒబామా వైపు, పురుష ఓటర్లు రోమ్నీ వైపు చూస్తున్నారట.

చిట్టచివరి నిమిషంలో కీలకమైన పారిశ్రామికవేత్తల మద్దతును కూడగట్టుకోవాలన్నది ఒబామా వ్యూహంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఒబామాకు 50%, రోమ్నీకి 47% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్లు ప్రఖ్యాత ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఇద్దరూ తెల్లవారుజామునే ప్రచారం మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. శాండీ హరికేన్ నష్టాలను సమర్థంగా అడ్డుకున్నారని 69 శాతం మంది ఓటర్లు ఒబామాకు మద్దతిచ్చే అవకాశముంది.

అయితే, రోమ్నీ కూడా తన భార్య ఆన్ రోమ్నీతో కలిసి ఎన్నికలకు ముందు చివరి రోజు ప్రచారంలో పాల్గొంటారు. మిన్నెసోటాలో ప్రచారానికి ఆయన తన కొడుకు జోష్‌ను పంపారు. ఫ్లోరిడాలో తెల్లవారుజామున ఎన్నికల ర్యాలీ మొదలుపెట్టే రోమ్నీ.. తర్వాత వర్జీనియా, ఓహియోలకు వెళ్లి, ఆర్ధరాత్రికి న్యూహ్యాంప్‌షైర్‌లో తన ప్రచారం ముగిస్తారు. చిట్టచివరి ప్రచారంలో ఒబామాతో పాటు డెమొక్రాటిక్ స్టార్ ప్రచారకర్త బిల్‌ క్లింటన్ కూడా పాల్గొనగా, రోమ్నీ ఒంటరిగా పెన్సిల్వేనియా వెళ్లారు.

అయితే ఇరువురు ప్రచారం హోరాహోరీగా చేస్తున్నప్పటికీ సర్వేలు మాత్రం ఒబామా వైపు కాస్త మొగ్గు చూపుతున్నాయి. వారం క్రితం వరకు చేసిన సర్వేలో అభ్యర్థులిద్దరికీ 47 శాతం చొప్పున ఓట్లు రాగా ఇప్పుడు మాత్రం ఒబామాకు 50%, రోమ్నీకి 47% వస్తాయని ప్యూ సర్వేసంస్థ తెలిపింది. అన్ని సర్వేల్లో ఒబామాకు 0.3 శాతం ఆధిక్యత ఉందని రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ చెప్పింది.

సిఎన్ఎన్/ఓఆర్‌సి సర్వే మాత్రం ఇద్దరికీ 49% ఓట్లనే కట్ట బెట్టింది. సి-ఓటర్ సర్వేలో ఒబామాకు 49%, రోమ్నీకి 48% వచ్చా యి. మహిళల్లో 53%, పురుషుల్లో 44% మంది ఒబామావైపు మొగ్గుతున్నారు. శ్వేత జాతీయుల్లో రోమ్నీకి 57%, ఒబామాకు 40% ఓట్లు వచ్చేలా ఉన్నాయి. ఏడాదికి 50వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిలో ఒబామాకు 56%, రోమ్నీకి 40% వస్తాయి.

అమెరికాను అతలాకుతలం చేసిన శాండీ తుఫాను ఒబామాకు ప్లస్ అయింది. తుఫాను విపత్తును ఒబామా సమర్థవంతంగా ఎదుర్కొన్నారని 69 శాతం మంది చెప్పారంటే అది ఎన్నికలలో తోడ్పాడు అవుతుందనే చెప్పవచ్చు. తాజాగా వచ్చిన శాండీ తుఫాను ఎఫెక్ట్ ఒబామాపై ఉంటుందని మొదటే అందరూ చెప్పారు. ఆయన శాండీని సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్లస్ అవుతుందని, లేదంటే నష్టపోవాల్సి వస్తుందని భావించారు. అనుకున్నట్లుగానే శాండీ ఆయనకు ప్లస్ అయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని barack obama వార్తలుView All

English summary
Notwithstanding the latest opinion polls suggesting a close fight between incumbent Barack Obama and his rival Mitt Romney, both the Democrat and Republican camps have claimed victory ahead of the crucial presidential elections set for today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more