• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుటుంబాల పొలిటికల్ వార్: కొత్తగా కెసిఆర్‌కూ

By Srinivas
|

K Chandrasekhar Rao -Purandeswari - Chandrababu Naidu
రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యామిలీ కోల్డ్ వార్ జరుగుతోంది! వివిధ రాజకీయా పార్టీలలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకాలం పాటు ఒకటి, రెండు పార్టీలలో మాత్రమే ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు ఏకంగా అది మూడు పార్టీలకు పాకింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నాయ కత్వాల కుటుంబాలు, బంధు గణాలు క్రమంగా వివిధ పార్టీలకు విస్తరించాయి. బంధుత్వాల కారణంగా ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కలుసుకోవటం, తాత్కాలికంగా ముచ్చటించుకోవటం తప్ప మిగిలిన సందర్భాలలో ఎవరిదారి వారిదే అనే రీతిలో ఆయా పార్టీలలోని కుటుంబాలు, బంధుగణాల మధ్య సంబంధాలు సాగుతున్నాయి.

ఇటీవల వాన్‌పిక్‌ కుంభకోణంలో సిబిఐ చార్జిషీటు ఎదు ర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి నిర్ణ యం కోసం ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర సీనియర్‌ నేత ధర్మాన ప్రసాద రావు ఆ ప్రాంతంలో ఇంకా కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇటీవల నరసన్నపేట నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కృష్ణదాస్‌ ఓటమికి ధర్మాన చాలా సీరియస్‌‌గా కృషి చేశారు. మరో సోదరుడు ధర్మాన రాందాస్‌ను కాంగ్రెస్‌ తరఫున బరిలో దించి అన్నీ తానై ప్రచారం చేశారు.

అయినప్పటికీ విజయం కృష్ణదాస్‌ను వరించింది. రాజకీయంగా సోదరులిద్దరూ రెండు పార్టీలలో ఉన్నప్పటికీ, కుటుంబపరంగా జరిగే కార్యక్రమాలకు మాత్రం కలుసుకుంటున్నారు. ఆ మధ్య ధర్మానపై ఆరోపణలు వచ్చినప్పుడు కృష్ణదాస్‌ అప్పట్లో మంత్రిగా ఉన్న ప్రసాద రావు చాంబర్‌కు వెళ్ళి మంతనాలు జరపటం విశేషం. ఇక టిడిపిలో పార్టీ ముఖ్య నేతకే ఫ్యామిలీ నుండి ఇక్కట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పని చేస్తుంటే ఆయన వదిన, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధీశ్వరి కాంగ్రెస్‌ మంత్రిగా కేంద్రంలో ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సొంత పార్టీ పెట్టినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసుకు సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

తెలుగుదేశం పార్టీలోనే బావా బావమరదులైన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి వేర్వేరు పార్టీలలో ఉన్నారు. సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకుడుగా చెలామణి అవుతుంటే, ఆయన బావమరిది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా ఉన్నారు. విశేషం ఏమిటంటే ఇటీవల కోవూరు నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వీరిద్దరూ ముఖాముఖి తలపడ్డారు.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ ఇటీవలి కాలంలో బంధుగణం మధ్య విభేదాలు పెరిగిపోయాయి. కెసిఆర్‌, ఆయన కుమార్తె, కుమారుడు, మేనల్లుడు హరీశ్‌ రావు టిఆర్‌ఎస్‌లో కొనసాగుతుంటే, మరో మేనల్లుడు, సోదరి కుమారుడు ఉమేశ్‌రావు పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. కెసిఆర్‌కూ, ఉమేశ్‌కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న తెలంగాణ భవన్‌లో ఒక ఎలక్ట్రానిక్‌ మీడియాను నడిపిస్తున్నారని, వాణిజ్య ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ ఉమేశ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దానిపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది కూడా. ఇక కెసిఆర్‌ స్వయంగా కాళ్ళు కడిగి కన్యా దానం చేసిన సోదరుడు రంగారావు కుమార్తె రమ్యా మధుసూదన్‌ రావు తాజాగా మరో కొత్త పార్టీలోకి చేరిపోయారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత, కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ ఇటీవల స్థాపించిన తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె నియమితులైతే భర్త మధుసూదన్‌ రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

English summary

 The political war is going between Chandrababu Naidu and Purandeshwari, TRS chief K Chandrasekhar Rao and his relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X