వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి ఎఫెక్ట్: రంగంలోకి సోనియా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికలపై కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలను చక్కదిద్దేందుకు అధిష్ఠానమే రంగంలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. బుధవారం లోక్‌సభలో తనను కలిసిన పార్లమెంటు సభ్యులతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆమె స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలను తెలియజేస్తున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపిలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కావూరి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ సోనియాను కలిశారు. వీరు ఉప ఎన్నికల ఫలితాలను వివరించినట్లుగా సమాచారం. తెలంగాణకు చెందిన ఆరు స్థానాల్లో టిఆర్ఎస్, బిజెపి, సీమాంధ్రలోని కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించారని చెప్పే ప్రయత్నం చేశారని, అయితే దానికి ఆమె వారితో... ఈ ఫలితం ముందుగా ఊహించిందేనని, దీని ప్రభావం త్వరలో జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడాలని సూచించారని తెలుస్తోంది.

రాష్ట్రంలో సీనియర్లతో సమన్వయం సరిగా లేదని, ఇదే ప్రధాన లోపమని, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదని, ఇదే పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఇక నేనే రంగంలోకి దిగుతానని, సమన్వయం ఉండేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలపైనా ఉందని ఆమె అన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో త్వరగా కఠిన చర్యలు తీసుకోకపోతే లాభం ఉండదని కావూరి, త్వరలో మరో 18 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు ఉన్నాయని, పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని మాగుంట సోనియాకు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె కలిసి కార్యాచరణపై చర్చిద్దామని చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేక సెంటిమెంట్ దృష్ట్యా ఈ ఎన్నికలు జరిగినందున వీటిని వదిలేసి, వచ్చే పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సోనియా వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, AICC president Sonia Gandhi is concentrating on AP politics now, after bypolls defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X