వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర రాజకీయాలకు స్టార్ అట్రాక్షన్ వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి పుట్టింది. నిజానికి, 2009 ఎన్నికల తర్వాత ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుతూనే ఉంటోంది. రాజకీయ పార్టీల పెద్దలు ఊపిరి తీసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఉప ఎన్నికల కారణంగా, పార్టీల మధ్య పోటీ కారణంగా రాజకీయ పార్టీల నాయకులు నిత్యం ప్రజల ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా పార్టీలకు క్రౌడ్ పుల్లర్స్ కావాల్సి వచ్చింది. వారిని ఎంచుకోవడానికి కూడా పార్టీలు సిద్ధపడ్డాయి.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి: కాంగ్రెసు పార్టీకి స్టార్ అట్రాక్షన్ తక్కువ. అయితే, మెగాస్టార్ చిరంజీవి ఆ కొరతను తీర్చడమే కాకుండా పార్టీ ప్రచార బాధ్యతలను మొత్తం భుజాన వేసుకునే అవకాశాలున్నాయి. చిరంజీవికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కాంగ్రెసు పార్టీకి ఆయన అత్యంత ముఖ్యమైన నాయకుడిగా మారారు.

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్


జూనియర్ ఎన్టీఆర్: తాత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హావభావాలను, వాచికాన్ని పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీకి ఓ అసెట్‌గా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. అయితే, ఈసారి చంద్రబాబుతో ఉన్న విభేదాల వల్ల ముందుకు వస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది.

బాలకృష్ణ

బాలకృష్ణ

బాలకృష్ణ: తెలుగుదేశం పార్టీ మరో పెద్ద దిక్కు నందమూరి హీరో బాలకృష్ణ. ఆయన ఎన్నికల్లో తన సత్తాను చాటడానికి మాత్రమే కాకుండా పార్టీని గెలిపించడానికి సింహంలా గర్జించేందుకు సిద్ధపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బాలకృష్ణది తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్ర కానుంది.

నారా లోకేష్

నారా లోకేష్

నారా లోకేష్: గత ఎన్నికల్లో తెర వెనక పాత్ర నిర్వహించిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారి తెర ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు కుమారుడిగా నారా లోకేష్‌కు ప్రజల నుంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి. ఆయనతో పాటు భార్య బ్రాహ్మణి దిగితే ఆ అట్రాక్షన్ స్థాయి గురించి చెప్పనే అక్కర్లేదు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత: తెరాసలో ఆమె ప్రధాన పాత్ర పోషించడం లేదు గానీ తెలంగాణ జాగృతి పేరు మీద తెలంగాణ ఉద్యమానికి ఆమె స్టార్ అట్రాక్షన్‌గా మారారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని అంటున్నారు. అంతేకాకుండా, ప్రచార బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలున్నాయి. సోదరుడు కెటి రామారావుకు దీటుగా ఆమె తెలంగాణ ఉద్యమంలో నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణ ఆమెకు ఓ పెద్ద ఆకర్షణను తెచ్చి పెట్టింది.

షర్మిల

షర్మిల

షర్మిల: పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు పాలై దిక్కు తోచని స్థితిలో ఉన్న సమయంలో షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అందివచ్చిన ద్రాక్ష పండు. వైయస్ రాజశేఖర రెడ్డి కూతురిగా ఆమెకు ప్రజల్లో స్టార్ అట్రాక్షన్ వచ్చింది. ఆమెను చూడడానికి ప్రజలు పెద్ద యెత్తున తరలిస్తున్నారు. సుదీర్ఘమైన పాదయాత్రకు సిద్ధపడి చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు.

కాంగ్రెసు పార్టీకి మెగస్టార్ చిరంజీవి మాస్ అట్రాక్షన్ కోసం పెద్ద దిక్కుగా మారారు. పార్టీ ప్రచార బాధ్యతను ఆయనపైనే పెడుతారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంతకు ముందు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించగా, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ అదనపు ఆకర్షణగా మారబోతున్నారు.

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షర్మిల ప్రధాన ఆకర్షణగా మారారు. జగన్ ఒక వేళ జైలు నుంచి వచ్చినా షర్మిల ప్రజల మధ్య ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ఉద్యమమే పెద్ద క్రౌడ్ పుల్లర్. అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవితి ఈసారి ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

English summary
In Andhra Pradesh every political party has its own crowd pullars, Chiranjeevi for Congress, Jr NTR, Balalrishna and Nara Lokesh dor TDP, Sharmila for YS Congress party, Kalwakuntla Kavitha for TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X