వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ డైరీ: కెవిపి అడ్డంగా దొరికిపోయారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్‌: వైయసార్ రాజశేఖర రెడ్డి డైరీ ఉదంతంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అడ్డంగా దొరికిపోయారనే మాట వినిపిస్తోంది. వైయస్ ఆత్మబంధువుగా చెప్పుకునే కెవిపి రామచందర్ రావు ఇటీవల వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర డైరీని కాంగ్రెసు పెద్దలతో ఆవిష్కరింపజేసిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణ ద్వారా ఆయన మొదటి విజయం సాధించినట్లు భావించినప్పటికీ ఇప్పుడు అదే ఆయనను ఇరకాటంలోకి నెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అధిష్టానాన్నే మోసం చేశారనే నిందను మోయాల్సిన స్థితిలో పడే ప్రమాదం ఆయనకు పొంచి ఉందని అంటున్నారు.

దివంగత ముఖ్య మంత్రి వెైఎస్‌ రాజశేఖరరెడ్డి మహా పాదయాత్రకు సంబంధించి, ఆయన ఆత్మ కెవిపి రామచందర్ రావువిడుదల చేసిన డెైరీ పుస్తకం వివాదాస్పదమవుతోంది. పాదయాత్ర సందర్భంగా వెైయస్ డెైరీ రాశారని, దానిని పుస్తకంగా తీసుకువస్తున్నానంటూ కెవిపి స్వయంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా అగ్ర నేతలకు చెప్పి, ఆ కార్యక్రమానికి అగ్ర నేతలను పిలిపించడంలో విజయం సాధించినా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు అసలు వెైయస్ తన పాదయాత్రలో ఎలాంటి డెైరీ రాయలేదని నాడు వెైఎస్‌ పాదయాత్రలో పాల్గొన్న వెైయస్సార్ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బాంబు పేల్చి కెవిపిని ఆత్మరక్షణలోకి నెట్టారు.

వైయస్ డైరీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలంటూ కెవిపి తమ పార్టీ అధినే త్రి సోనియా, పార్టీ సీనియర్లను కలిసి అభ్యర్ధించారు. అయితే సోనియా తాను రాకుండా సందేశం పంపించారు. ఆ సందేశాన్ని సుబ్బరామిరెడ్డి దానిని చదివి వినిపించారు. ఆజాద్‌, మోతీలాల్‌ ఓరా, వైయస్‌కు సన్నిహితులైన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫలితంగా కెవిపికి పార్టీలో పలుకుబడి సజీవంగా ఉందని, నాయకత్వం ఆయనను ఇంకా విశ్వసిస్తోందన్న సంకేతాలు వెళ్లాయి.

అయితే, వెైయస్ పాదయాత్రలో తొలి నుంచి తుది వరకు లగడపాటి రాజగోపాల్‌, భూమన కరణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు ఉన్నారు.ఈ డెైరీ అంతా బోగస్‌ అని, అసలు వెైఎస్‌ ఏనాడూ డెైరీనే రాయలేదని అంబటి రాంబాబు చెప్పారు. దాంతో ఢిల్లీలో జరిగిన డెైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి లగడపాటి రాజగోపాల్‌ అందుకే రాలేదేమోననే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిజంగా వెైఎస్‌ ఆ డెైరీ రాసి ఉంటే అప్పట్లో ఆ పాదయాత్రకు ఆర్ధికంగా చేయూత నిచ్చిన లగడపాటి తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వచ్చి ఉండేవారని అంటున్నారు.

పైగా, కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ పత్రికకు చెందిన మీడియా ప్రతినిధి అందించిన వివరాలతో వైయస్ డైరీకి రూపకల్పన చేశారనే విమర్శ కూడా రావడం కెవిపి రామచందర్ రావును మరింత కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనాలను పార్లమెంటు సభ్యుడు వి.హన్మంతరావు, ఇతర నాయకులు ఢిల్లీకి పంపించే పనిలో ఉన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నరేళ్లలో ఒక్కసారి కూడా మాటమాత్రంగానైనా వైయస్ ప్రస్తావించకపోవడాన్ని కెవిపి ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనకుండా, హైదరాబాద్‌లోనే ఉన్న కెవిపికి డైరీ విషయం తెలిసిందనే ప్రశ్న వేస్తున్నారు.

ఒకవేళ వెైఎస్‌ నిజంగా డెైరీ గనుక రాసి ఉంటే అది జగన్‌ దగ్గరో, విజయమ్మ వద్దనో ఉండాలే తప్ప, కెవిపి వద్దకు ఎలా చేరిందని ప్రశ్నిస్తున్నారు. డెైరీ అనేది వ్యక్తిగతమైనదని, అది కుటుంబసభ్యుల వద్ద మాత్రమే ఉంటుందే తప్ప, కెవిపి వద్ద ఉండటం సాధ్యం కాదంటున్నారు. హైదరాబాద్ వచ్చిన ఆజాద్‌ దృష్టికి అంబటి చేసిన వ్యాఖ్యలను ఆదివారంనాడు కొంత మంది నాయకులు తీసుకువెళ్లారు. చిరంజీవి విహెచ్ మేధోమథనం సదస్సులో చేసిన వ్యాఖ్యలను కూడా ఆజాద్ దృష్టికి తెచ్చారు. అన్ని విషయాలను మౌనంగా విన్న ఆజాద్‌ ‘అన్నీ మేడమ్‌ దృష్టికి తీసుకువెళ్లండి' అని సూచించినట్లు తెలిసింది.

మొత్తమ్మీద, ఆంజనేయుడ్ని చేయబోతే కోతి అయినట్లుగా కెవిపి పరిస్థితి తయారైందని అంటున్నారు. కెవిపిపై ఆంతర్యుద్ధం సాగించేందుకు నాయకులు కొంత మంది ఏకమవుతున్నారు. కెవిపి చాలా చిక్కుల్లో ఉన్నారని, వాటి నుంచి బయటపడేందుకే డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారని విహెచ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి చూస్తే కెవిపిపై పార్టీలో పెద్ద యెత్తున దుమారం చెలరేగే పరిస్థితే ఉంది.

English summary
Congress Rajyasabha member KVP Ramachandar Rao in fix with the releasing function of YS Rajasekhar Reddy's padayatra dairy. Congress leaders like V Hanumanth Rao are attacking KVP Ramachandar Rao on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X