మా ఇంట్లోనూ..: చెర్రీకి అఖిలేష్ హ్యాండ్!(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగులులో జరిగిన అఖిల భారత యాదవ మహాసభకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలను కలుసుకున్నారు. బహిరంగంగా రాజకీయాలు మాట్లాడనప్పటికీ అంతర్గతంగా మూడో కూటమి, 2014 సాధారణ ఎన్నికలు, విభజన తదితర అంశాల పైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్న అఖిలేష్ యాదవ్ రెండు రోజుల పాటు హైదరాబాదులో గడిపారు. అఖిలేష్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో అరగంట పాటు ముచ్చటించారు. మూడో కూటమి సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లుగా సమాచారం. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కూడా కలిసి వెళ్లే అంశాన్ని అఖిలేష్ కొట్టి పారేయలేదు.
ఎవరితో వెళ్తామో అప్పుడే చెప్పలేమని అభిప్రాయపడిన అఖిలేష్.. తన తండ్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆదివారం ఉదయం మంత్రి రఘువీరా రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరుల ఇళ్లకు వెళ్లారు. అనంతరం యాదవ మహా సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ శనివారం సాయంత్రం ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయనకు కిరణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. పక్కనే కికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డిలు ఉన్నారు.

షేక్ హ్యాండ్
తనను క్యాంపు కార్యాలయంలో కలిసిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చేయి కలిపిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇద్దరు కాసేపు రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. వారిద్దరి మధ్య చిన్న రాష్ట్రాల అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

క్యాంపులో..
క్యాంపు కార్యాలయంలో యుపి సిఎం అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్పిరామి రెడ్డి తదితర నేతలు.

శాలువా కప్పుతున్న కిరణ్
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలుపుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. పక్కనే మంత్రి రఘువీరా రెడ్డి.

రామ్ చరణ్‌తో మాటా మంతి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇంటికి వచ్చిన యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హీరో రామ్ చరణ్ తేజతో మాట్లాడుతున్న దృశ్యం. పక్కనే మంత్రి గంటా శ్రీనివాస రావు తదితరులు.

చేతిలో చేయి
చిరంజీవి ఇంటికి వచ్చిన అఖిలేష్ యాదవ్ చెర్రీతో చేయి కలిపారు. తాను విద్యార్థిగా మైసూరులో ఉన్నప్పుడు మెగాస్టార్ సినిమాలు చూశానని అఖిలేష్ చెప్పారట. జంజీర్ సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పిన అఖిలేష్.. రాబోయే చెర్రీ జంజీర్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

మా ఇంట్లో నలుగురు... మీ ఇంట్లో నలుగురు..!
చిరుతో, చెర్రీతో కాసేపు మాట్లాడిన అఖిలేష్ యాదవ్ మెగాస్టార్ నివాసాన్ని ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి నుండి హైదరాబాద్ మొత్తాన్ని వీక్షించే అవకాశం చిరు ఇంటికి ఉండటం గొప్ప విషయమన్నారు. చిరు ఇంట్లో నలుగురు హీరోలు ఉంటే.. తమ ఇంట్లో నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారని చలోక్తి విసిరారు.

జగన్, బాబులపై డైలమా
2014 ఎన్నికల తర్వాత మూడో కూటమి ఉంటుందని చెప్పిన అఖిలేష్ యాదవ్ మన రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఒకరు తనకు, మరొకరు తన తండ్రికి ఫ్రెండ్స్ అని చెప్పి.. ఇద్దరినీ రిజర్వ్‌లో ఉంచారు.

కాన్వాయ్‌పై అటాక్
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌కు పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది అఖిలేష్ యాదవ్ కాన్వాయ్‌తో వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో పలువురు యుపి ముఖ్యమంత్రి కాన్వాయ్ పైన దాడికి పాల్పడ్డారు.

బిర్యానీ ఇష్టం
తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని నగరానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. అదే సమయంలో రాష్ట్ర యువతకు కితాబిచ్చారు. అన్నింటా ముందున్నారని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications