కిరణ్ సేఫ్: బొత్సకు ఎసరు, డిఎస్ వైపు మొగ్గు?

అందులో భాగంగా పిసిసి పీఠంపై డి.శ్రీనివాస్‌ను కూర్చుండబెట్టాలని చూస్తున్నారట. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న డిఎస్.. పార్టీ పెద్దలతో సమాలోచనలు జరుపుతున్నారు. శనివారం ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన డి.శ్రీనివాస్‌కు పగ్గాలు అప్పగించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వాదనతో డిఎస్ ఏకీభవించడం లేదట. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్న సమయంలో, పిసిసి చీఫ్ పదవిని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని చూస్తున్నారట. ముఖ్యమంత్రి పదవి సీమాంధ్ర నేతకు ఉండగా, చీఫ్ పదవిని తెలంగాణ వారికి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి మారుతారనే ప్రచారం జరిగినప్పటికీ, జోడు పదవులు ఉన్న బొత్సకే షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
బొత్స స్థానంలో డిఎస్‌ను నియమిస్తారనే ప్రచారం కొన్ని నెలలుగా జరుగుతోంది. బొత్సకు జోడు పదవులు కూడా ఉన్నాయి. జోడు పదవులు ఉండవద్దనేది కాంగ్రెసు నియమం. బొత్స మంత్రి పదవి వదులుకొని పిసిసి పీఠం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, పిసిసి పీఠం నుండే అధిష్టానం తొలగించే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications