టి: కిరణ్‌కు చెక్ పెడుతున్న ఆజాద్(పిక్చర్స్)

కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మాజీ ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ అంశంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఆజాద్ రాయల తెలంగాణ కోసం పట్టుబడుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సీమాంధ్ర నేతలకు తరుచూ ఫోన్లు చేస్తూ వారిని ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో తనకు ఉన్న కాంటాక్ట్స్ నేపథ్యంలో ఆయన పలువురిని రాయల టికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా ఆజాద్ సీమాంధ్రకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారట. రాయల తెలంగాణకు అంగీకరించాలని చెబుతూ, రాష్ట్రం విడిపోయాక మంచి పదవులు ఇస్తామని చెబుతున్నారట. ప్రధానంగా ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులతో చర్చలు జరుపుతున్నారట. ఆజాద్, కిరణ్‌ల మధ్య మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విషయంలో విభేదాలు వచ్చినట్లుగా సమాచారం.

డిఎల్ రవీంద్రా రెడ్డిని తొలగించిన సమయంలో.. ఆయనను తొలగించవద్దని, అవసరమైతే రాజీనామా కోరాలని కిరణ్‌కు ఆజాద్ సూచించారట. కిరణ్ మాత్రం ఆజాద్ మాట వినకుండా డిఎల్‌కు ఉద్వాసన పలికారు. ఇది ఆజాద్‌కు ఆగ్రహం కలిగించిందని, అప్పటి నుండి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయంటున్నారు. కిరణ్ సమైక్యాంధ్ర అంటుండగా.. విభజనకు అనుకూలంగా ఉన్నా ఆజాద్ రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకు వచ్చి, పలువురు సీమాంధ్ర నేతలకు అంగీకరించాలని చెబుతూ, మంచి పదవులు ఇస్తామని చెబుతున్నారట.

ఆజాద్ రాయల తెలంగాణం

ఆజాద్ రాయల తెలంగాణం

కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు మాజీ ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణ కోసం లాబీయింగ్ చేస్తున్నారట. అధిష్టానం హైదరాబాదుతో కూడిన పది జిల్లాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆజాద్ మాత్రం రాయల తెలంగాణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.

కిరణ్ వర్సెస్ ఆజాద్!

కిరణ్ వర్సెస్ ఆజాద్!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య గళం వినిపిస్తుండగా, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణ అంటున్నారు. కిరణ్ వర్గం సమైక్య ప్రయత్నాలకు ఆజాద్ చెక్ చెబుతున్నారట.

బొత్స సహకారం

బొత్స సహకారం

కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆజాద్‌కు రాయల తెలంగాణ విషయంలో సహకరిస్తున్నారని అంటున్నారు.

డిఎల్ ఉద్వాసన

డిఎల్ ఉద్వాసన

మాజీ మంత్రి, కడప జిల్లా కాంగ్రెసు సీనియర్ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రా రెడ్డి ఉద్వాసన అంశంపై కిరణ్, ఆజాద్‌ల మధ్య పొరపొచ్చలు వచ్చినట్లుగా తెలుస్తోంది. డిఎల్ రాజీనామా కోరమని ఆజాద్ చెప్పగా, కిరణ్ మాత్రం ఆయనకు ఉద్వాసన పలికారంటున్నారు.

నేతలతో సంప్రదింపులు

నేతలతో సంప్రదింపులు

ఆజాద్ రాయల తెలంగాణ కోసం సీమాంధ్ర నేతలతో పాటు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతోను చర్చలు జరిపారట. సీమాంధ్ర నేతలకు ఫోన్స్ చేస్తున్న ఆజాద్.. రాయల టికి అంగీకరిస్తే పదవులు ఇస్తామని చెబుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+