'మోడీ: సైద్ధాంతిక యోధుడే కానీ అవకాశవాది'

భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ద్రువతారలాంటివారని, పాకిస్థాన్ విషయంలో మాత్రం ఆయనకు ద్వైదీభావం ఉందని అన్నారు. పలు మత ఘర్షణలతో ఆయనకు సంబంధం ఉన్నా, సమర్థులైన భారత రాజకీయ నాయకుల్లో ఆయనొకరన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ తరచు ఆయన విమర్శలు గుప్పిస్తారని, ఈ విషయంలో స్పష్టమైన విధానం లేనందుకు అమెరికానూ విమర్శిస్తారని తెలిపారు.
ఈ రచయిత కోహెన్ ప్రస్తుతం.. వాషింగ్టన్‌కు చెందిన బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ సభ్యుడు. బిజెపి భాగస్వామ్య పక్షం ఆర్ఎస్ఎస్‌ను పొగుడతూ.. పాక్ ఉగ్రవాదంపై మోడీ కఠిన వైఖరి దృష్టిలో ఉంచుకొనే ఆమెరికా ఆయనకు వీసా నిరాకరించిందని రచయిత తెలిపారు. చైనా నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు మోడీ ఆ దేశం వెళ్లినప్పుడు.. పాక్ ఆక్రమిత కాశ్మీరులో చైనా దళాలు ఉండటంపై ఆయన సముచితంగానే మాట్లాడారని పేర్కొన్నారు.
భారత్, పాక్ సంబంధాలపై మోడీ సుముఖంగానే ఉన్నారని, గుజరాత్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఆ దేశంతో విస్తారంగా వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవచ్చునని నరేంద్ర మోడీ అన్నట్లుగా చైనీయులు పేర్కొన్నట్లు రచయిత తెలిపారు.


Click it and Unblock the Notifications