వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి: అగ్రనేత అద్వానీ శకం ముగిసినట్లేనా..

By Pratap
|
Google Oneindia TeluguNews

LK Advani
న్యూఢిల్లీ: దేశంలో పార్టీని కాంగ్రెసుకు దీటుగా నిలిపిన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ శకం ముగిసినట్లేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా పార్టీని తన కనుసన్నల్లో నడిపించిన లాల్ కృష్ణ అద్వానీకి ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో పాత్ర ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ పరిణామం అద్వానీ శకం అంతాన్ని సూచిస్తోంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధానప్రతిపక్షాన్ని పార్టీకి చెందిన ఐదుగురు నాయకుల బృందం నడిపిస్తుంది.

పార్టీలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ది (ఆర్‌ఎస్‌ఎస్‌) నిర్ణయం కారణమని అంటున్నారు. ఇకపై బిజెపిలో కీలక నిర్ణయాల్ని ఆ ఐదుగురు నాయకులు కలిసి తీసుకుంటారు. ఈ బృందంలో గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఉన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఈ బృందం కూర్పు గురించి చర్చించారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుడు ఒకరు తెలిపారు. అంతేకాక, బిజెపి వ్యవహారాలను సంఘ్‌ పరివార్‌ నడిపి స్తోందనే ముద్రను తొలగించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోందని ఆయన చెప్పారు. ‘బీజేపీ నాయకులకు అద్వానీ ఒక గురువుగా కొనసాగుతారు. కానీ, నిర్ణయా లు మాత్రం వేరేచోట జరుగు తాయి' అని తన పేరు చెప్పడానికి ఇష్టప డిని ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు తెలిపారు.

నిజానికి అద్వానీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు గత కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయి. పాకిస్థాన్‌ రూపశిల్పి మహమ్మ దాలీ జిన్నాను ప్రశంసించిన తర్వాత అద్వానీ 2005లో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. పార్టీలో అసమ్మతివాది అనే భావన అద్వానీపట్ల పెరుగుతూ వస్తోంది. పార్టీలో జరుగుతున్న అవినీతికి కళ్లెం వేయడంలో బిజెపి విఫలమైందని అద్వానీ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లో అవినీతిని ఎండగట్టి, పరిస్థితిని బిజెపికి అనుకూలంగా మలుచుకునేందుకు ఇది అడ్డు వస్తోందని కూడా అద్వానీ చాలాసార్లు చెప్పారు.

ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ మండలి సమావేశంలో అద్వానీ సుష్మాస్వరాజ్‌ను ప్రశంసిం చారు. గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగింది. అద్వానీ అంతకు ముందు ఓ సందర్భంలో కూడా సుష్మా స్వరాజ్‌ వైపు మాట్లాడారు. నితిన్‌ గడ్కరీ స్థానంలో సుష్మాస్వరాజ్‌, ఉమా భారతి, రవిశ కర్‌ ప్రసాద్‌లకు బిజెపికి ప్రెసిడెంటయ్యే అర్హతలున్నాయని అద్వానీ చెప్పారు.

భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీకి రథయాత్రికుడిగా పేరుంది. ఇంతవరకు దేశవ్యాప్తంగా ఆయన చేసిన ఆరు రథయాత్రల్లో రామ్‌ రథ యాత్రకు బాగా పేరు రావడమే కాదు, అది వివాదాస్పదమైంది కూడా. ఈ యాత్రను ఆయన 1990లో చేపట్టారు. ఆయన ఇతర యాత్రల్లో జనదేశ్‌ యాత్ర (1993), స్వర్ణ జయంతి రథ్‌యాత్ర (1997), భారత్‌ ఉదయ్‌యాత్ర (2004), భారత్‌ సురక్షా యాత్ర (2006), జన చేతన యాత్ర (2011) ఉన్నాయి.

English summary
According to media reports - BJP senior leader LK Advani era in the party has ended. He will not paly any role in taking decissions in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X