ప్రశ్నలు: జగన్, కెసిఆర్ మీడియాకు పిలుపు నో

జగన్‌కు చెందిన సాక్షి మీడియాతో పాటు కెసిఆర్ మీడియా తమపై అసత్య కథనాలు రాస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, కెసిఆర్‌లు రెండు పార్టీలకు అధ్యక్షులని, అవినీతి, వసూళ్ళ డబ్బులతో సొంత మీడియా పెట్టుకున్నారని, ప్రతిరోజూ తన పైన, టిడిపి పైన వ్యతిరేక వార్తలు రాయడం, చూపించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. ఆ పార్టీల రాజకీయ ఎజెండాల ప్రకారం ఈ మీడియాలు పని చేస్తున్నాయన్నారు.
ఆ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది ఆ పార్టీల ఎజెండాలతో వచ్చి తమ పార్టీ విలేకరుల సమావేశాల్లో అంతరాయాలు కలిగిస్తున్నారని, స్వతంత్ర మీడియా ఏం అడిగినా చెబుతామని, ఏ విమర్శ చేసినా సహిస్తామని, అవసరమైతే సరిదిద్దుకుంటామని, రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్న జగన్, కెసిఆర్ మీడియా సంస్ధలను భరించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
మీడియా విషయంలో తనకున్నంత సహనం దేశంలో ఎవరికీ లేదని, వామపక్ష పార్టీలతో తమకు కొంతకాలం మిత్రత్వం ఉందని, కొంతకాలం విభేదాలు ఉన్నాయని, అయినా వాటి మీడియా విషయంలో తమకు ఎప్పుడూ సమస్యలు రాలేదన్నారు. జగన్, కెసిఆర్‌ల మీడియా పనిగట్టుకొని చేసే గొడవను తమ సమావేశాల్లో భరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. అవి తమ సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని అనుకుంటున్నామన్నారు.
కొద్ది రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జగన్, కెసిఆర్ మీడియా ప్రతినిధులు విలేకరులుగా కాకుండా వారి వారి పార్టీల ప్రతినిధిలా ప్రశ్నిస్తున్నారని అన్నారు. తాను ఒక పత్రికను నెలకొల్పి జగన్ వద్దకు పంపించి ఇలాగే అడగనిస్తారా అని ప్రశ్నించారు. సొంత పత్రికలు, ఛానళ్లు ఉన్నంత మాత్రాన గెలవడం సాధ్యం కాదన్నారు.












Click it and Unblock the Notifications