ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

అస‌లు సిస‌లు వ‌ర్గ పోరాటాల‌కు..ఆధిపత్య రాజ‌కీయాల‌ను క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లు నిద‌ర్శ‌నంగా నిలుస్తాయి. 2009 లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత ఎర్ర‌గుంట్ల‌, ముద్ద‌నూరు మండ‌లాలు ఇదే అసెంబ్లీ ప‌రిధిలోకి చేరాయి. మంత్రిగా ప‌ని చేసిన శివారెడ్డి ఇక్క‌డి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రి గా ప‌ని చేసారు. శివా రెడ్డి హత్య‌కు గుర‌య్యారు. శివారెడ్డి అన్న కుమారుడైన రామ‌సుబ్బారెడ్డి ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి గా ప‌ని చేసారు. ఇక్క‌డ‌, వారికి ప్ర‌త్య‌ర్ధిగా ఉంటూ వ‌స్తున్న ఆదినారాయ‌ణ రెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ నుండి 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలుపొందారు. అయితే, కొద్ది కాలం క్రితం చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో బ‌ద్ద శ‌త్రువులైన ఇద్ద‌రూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు.

14 సార్లు ఎన్నిక‌లు.. ఎత్తుకు పై ఎత్తులు..

జ‌మ్మ‌ల‌మ‌డుగు లో 1952 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు, టిడిపి అయి దు సార్లు, వైసిపి, కేఎంపిపి, జ‌న‌తా పార్టీలు ఒక్కోసారి గెలుపొంద‌గా, రెండు సార్లు స్వ‌తంత్ర అభ్య‌ర్దులు గెలిచారు. ఇక్క‌డ ఆధిపత్య పోరులో భాగంగా..రెండు వ‌ర్గాల నేత‌లు..టిడిపి - కాంగ్రెస్ గా రాజ‌కీయాల్లో నియ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ టిడిపిలో నే ఉన్నా.. రామ‌సుబ్బారెడ్డి రెండు సార్లు ఆదినారాయ‌ణ రెడ్డి సోద‌రుడు నారాయణ రెడ్డి పై గెలుపొందారు. ఇక‌, మూడు సార్లు ఇక్క‌డి నుండే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయ‌ణ రెడ్డి..ప్ర‌తీ సారి రామ‌సుబ్బారెడ్డి మీదే గెలిచారు. ఇక్క‌డ వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు..వ‌ర్గ పోరాటాలు ఉన్నా..ప్ర‌స్తుతం టిడిపిలో ఒక‌రు మంత్రిగా..మ‌రొక‌రు శాన‌స మండ‌లి స‌భ్యుడిగా ఉన్నారు.

#AndhraPradeshElections2019: All about JAMMALAMADUGU Constituency

2014 ఎన్నిక‌ల్లో 85 శాతం పోలింగ్..వైసిపి దే విజ‌యం..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తంగా 227596 ఓట్లు ఉండ‌గా, అందులో 194747 ఓట్లు పోల‌య్యాయి. కాగా, అందులో పురుష ఓట‌ర్లు 95840 కాగా, మ‌హిళా ఓట‌ర్లు 98907 గా ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తంగా 85.57 శాతం పోలింగ్ న‌మోదైంది. ఆ ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేసిన ఆదినారాయ‌ణ రెడ్డికి 100794 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ది రామ‌సుబ్బారెడ్డిక 88627 ఓట్లు ద‌క్కాయి. ఆది నారాయ‌ణ రెడ్డి 12167 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ త‌రువాత వైసిపి నుండ టిడిపిలోకి ఫిరా యించారు. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఇప్పుడు టిడిపి కి క‌డ‌ప జిల్లాలో కీల‌క నేత గా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+