ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కావలి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావలి ది ప్రత్యేక స్థానం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇక్కడి రాజకీయ సమీ కరణాల్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఆల్లూరు నియోజకవర్గంలో ఉన్న అల్లూరు..బోగోలు మండలాలు పూర్తిగా కావలి నియోజకవర్గం లో కలిసాయి. ఇక, తొలి నుండి కాంగ్రెస్ - టిడిపి ల మధ్య హోరా హోరీ పోరు సాగుతూనే ఉంది. ఇక్కడ నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న టిడిపి - వైసిపి నేతలు తమ పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే..ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పోటీ మరింత రసవత్తరంగా మారింది.
1952 లో ఏర్పాటు..
నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం 1952 లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు కావలి అసెంబ్లీకి 15 సార్లు ఎన్నికలు జగిగా యి. అందులో కాంగ్రెస్ అభ్యర్ధులు ఏడు సార్లు విజయం సాధించారు. కాగా, టిడిపి మూడు సార్లు గెలిచింది. కెఎమ్‌పిపి ఒక సారి, స్వతంత్ర పార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి గెలవగా..2014 ఎన్నికలోల వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి బిసి వర్గాని కి చెందిన బీదా మస్తాన రావు గెలిచారు. అయనే 2014 లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసారు.

మొత్తం 2.30 లక్షల ఓట్లు..
కావలి నియోజకవర్గం లో మొత్తం ఓట్లు 2014 ఎన్నికల ప్రకారం 2,29,896. అందులో ఆ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య 182395. ఇక 2014 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాపరెడ్డి 89,589 ఓట్లు పోలయ్యాయి. ఇక, టిడిపి నుండి పోటీ చేసిన బీదా మస్తాన రావు కు 84, 620 ఓట్లు దక్కాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్ది డిపాజిట్లు కోల్పోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి ఓడిపోయిన ప్రతాపరెడ్డి, 2014 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసి టిడిపి అభ్యర్ది పై 4969 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications