ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రంప‌చోడ‌వ‌రం (ఎస్టీ) నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

గ‌తంలో ఎల్ల‌వ‌రం పేరుతో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాన్ని 2009 లో డీలిమిటేష‌న్ లో భాగంగా ర‌ద్దు చేసి రంప‌చోడ‌వం ఏర్పాటు చేసారు. గ‌తంలో ఉన్న మండ‌లాలు య‌ధావిధిగా కొన‌సాగుతున్నాయి. టిడిపి ఆవిర్భావం త‌రువాత ఇక్క‌డ 2009 లో మా త్ర‌మే ఓడిపోయింది. సీతంశెట్టి వెంక‌టేశ్వ‌ర రావు ఇక్క‌డ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చోడ మ‌ల్లిఖార్జున , చిన్నం జోగారావులు రెండేసి సార్లు గెలుపొందారు. 2004 లో టిడిపి త‌ర‌పున గెలిచిన ర‌మేష్, మాజీ ఎమ్మెల్యే చిన్నం జోగా రావు కుమారుడు. 2009 లో ఇక్క‌డ కాంగ్రెస్ నుండి స‌త్యానారాయ‌ణ రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో మాజీ ఎమ్మెల్యే సీతం శెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసారు. 2014 ఎన్నిక‌ల నాటికి తిరిగి టిడిపి అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009 త‌రువాత రాజ‌కీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి.

12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
ఇక్క‌డ మొత్తంగా 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఆరు సార్లు, వైసిపి ఒక్క‌సారి గెలి చాయి. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టిడిపి మాజీ ఎమ్మెల్యే..వైసిపి మ‌ధ్య పోటీ జ‌రిగింది. అర‌కు లోక్‌స‌భ ప‌రిధిలోకి వ‌చ్చే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సైతం 2014 ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్దికి మెజార్టీ వచ్చింది.

AndhraPradeshElections2019: All about Rampachodavaram (S.T) Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 150838 ఓట్లు ఉండ‌గా ,అందులో 113158 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన రాజేశ్వ‌రి కి 52156 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన సీతంశెట్టి వెంకటేశ్వ‌ర‌రావుకు 48934 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ది రాజేశ్వ‌రి 8222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్క‌డ నుండి వైసిపి అభ్య‌ర్దిగా గెలిచిన రాజేశ్వ‌రి ఆ త‌రువాతి కాలంలో టిడిపిలోకి ఫిరాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+