ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సుళ్లూరు పేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజన తరువాత సైతం ఈ నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోనే కొనసాగుతోంది. సత్య వేడు, వెంకటగిరి లోని కొన్ని మండలాలు డీ లిమిటేషన్ లో భాగంగా సుళ్లూరుపేటలో చేరాయి. ఈ నియోజకవర్గంలో పరసా వెంకటరత్నం మూడు సార్లు గెలవగా..రెండు సార్లు ఓడిపోయారు. ఆయన మంత్రిగానూ పని చేసారు. ఏపి సరిహద్దు నియోజకవర్గం కావటంతో ఇక్కడ తమిళులు ఎక్కువగానే కనిపిస్తారు.
1962 నుండి ...నియోజకవర్గంలో..
1962 లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటైన సుళ్లూరుపేట నియోజకవర్గం ఆ తరువాత ఎస్సీ రిజర్వ్ గా మారింది. ఇందు లో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి అయిదు సార్లు, ఒక్క సారి స్వ తంత్ర అభ్యర్ధి, ఒక్కసారి వైసిపి అభ్యర్ధి గెలుపొందారు.

2014 ఓటర్లు..విజేత..
2014 లో ఎన్నికల్లో మొత్తం 226805 ఓటర్లు ఉండగా..అందులో 175744 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు . వైసిపి నుండి పోటీ చేసిన కె సంజీవయ్య కు 85848 ఓట్లు రాగా.. టిడిపి అభ్యర్ధి పివి రత్నయ్య కు 81617 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి సంజీవయ్య 3780 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉండే ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ స్థానానికి వైసిపి అభ్యర్ది వరప్రసాద్ కు 14862 ఓట్లు మెజార్టీ దక్కింది. ఇక, సంజీవయ్య వైసిపి లో క్రియాశీలకం గా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఒక్క గూడూరు మినహా 2014 లో వైసిపి గెలిచిన ఇతర నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు యధాతధంగా సీట్లు వచ్చే ఎన్నికల్లోనూ కేటాయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications