ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కృష్ణలంకతో పాటుగా కంకిపాడు పరిధిలోని నగర వార్డులు ఇందులో కలి సాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసిన యలమంచిలి రవి రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలను ఓడించారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని రాజశేఖర్ కాంగ్రెస్ నుండి పోటీ చేసారు. టిడిపి నుండి సీనియర్ నేత గద్దే రామ్మోహన్ బరిలో నిలిచారు. ఆ ఇద్దరి మీదా ప్రజారాజ్యం అభ్యర్ది గెలుపొందారు. 1984 లో ఎన్టీఆర్ పై తిరుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కరరావు ఇదే నియోజక వర్గం నుండి 1978 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 లో బిజెపి నుండి సినీ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి ఇదే నియోకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
తొలుత విజయవాడ దక్షిణంగా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుండి విజయవాడ తూర్పు నియోజకవర్గం గా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ తొమ్మిది సార్లు, టిడిపి రెండు సార్లు, బి జెపి, పీఆర్పీ ఒక్కోసారి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి గెలిచిన యలమంచిలి రవి టిడిపిలో చేరినా టిక్కెట్ లభించలేదు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో గత అభ్యర్ధులు పార్టీలు మారారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తంగా 278451 ఓట్లు ఉండగా, అందులో 164331 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన గద్దే రామ్మోహన్ కు 88784 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణకు 73281 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన గద్దే రామ్మోహన్ 15503 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications