ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ సౌత్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో నియోక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా విశాఖ‌-1 ర‌ద్దు చేసి విశాఖ ద‌క్ష‌ణం ఏర్పాటు చేసారు. పూర్తిగా న‌గ‌రంలోని డివిజ‌న్ల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌టైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. 2009 వ‌ర‌కు ఉన్న విశాఖ‌-1 నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ముఖ స్వాతంత్ర స‌మ‌ర యోధుడు తెన్నేటి విశ్వ‌నాధ్ విశాఖ‌-1 నుండి ఒక‌సారి , విశాఖ న‌గ‌రం నుండి ఒక‌సారి గెలిచారు. 1952 న‌నుండి 1962 వ‌ర‌కు విశాఖ‌ప‌ట్ట‌ణం గా ఈ నియోజ‌క‌వ‌ర్గం 1967 నుండి 2004 వ‌ర‌కు విశాఖ‌-1 గా ఉంది. ఇక్క‌డి నుండి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ‌..ఆయ‌న త‌న‌యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ 2004, 2008 ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఇక‌, విశాఖ ద‌క్షిణంగా నియోజ‌క‌వ‌ర్గం రూపాంతరం చెంది న త‌రువాత ఇక్క‌డ రాజ‌కీయాల్లో మార్పులు జ‌రిగాయి.

13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
విశాఖ‌-1, విశాఖ ద‌క్షిణం తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 13 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు గెల‌వ‌గా.. టిడిపి నాలుగు సార్లు గెలిచింది. బిజెపి ఎమ్మెల్యే కంభంపాటి హ‌రిబాబు ఒక సారి గెలిచారు. ఆయన ప్ర‌స్తుతం విశాఖ ఎంపీ గా ఉన్నారు. ఇక‌, ఒక‌సారి స్వ‌తంత్ర అభ్య‌ర్ది గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్ర‌స్ నేత ద్రోణంరాజు శ్రీని వాస్ ప్ర‌జారాజ్యం అభ్య‌ర్ది పై విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న ప‌రిస్థితుల్లో ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర ణాల్లో మార్పులు జ‌రిగాయి. 2009 లో ఇక్క‌డ ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన అభ్య‌ర్ది 2014 ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్దిగా బ‌రి లో నిలిచారు.

#AndhraPradeshElections2019: All about Visakhapatnam South Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 197427 ఓట్లు ఉంటే, అందులో 128581 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ కు 66686 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కోలా గురువులు కు 48370 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ 18316 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్క‌డ 2014 ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ విశాఖ అభ్య‌ర్ది గా పోటీ చేసిన వైయ‌స్ విజ‌య‌మ్మ ప‌రాజ‌యం చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+