ప్రధానిని వద్ద ఇలా, తర్వాత ఝలక్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు రాష్ట్రానికి చెందిన నాయకులు శనివారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిశారు. ఆయనతో భేటీకి కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ సిద్ధపడ్డారు. వారికి తోడుగా ఆంధ్రప్రదేశ్ వ్య.వహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ప్రధానిని కలిసినవారిలో ఉన్నారు.

తుఫాను, వరద తాకిడి ప్రాంతాల ప్రజలకు సహాయం అందించాలని కోరడానికి తాము ప్రధానిని కలిసినట్లు వారు చెప్పినప్పటికీ రాష్ట్ర విభజనపై కూడా వారు తమ అభిప్రాయాలను ప్రధానికి విన్నవించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ కోరారు.

విభజన ప్రక్రియ సరిగా జరగడం లేదని పళ్లం రాజు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారంనాడు సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ విభజనపై నచ్చజెప్పారని అనుకున్నారు. అయితే, ప్రధానితో భేటీ తర్వాత మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి తాను విభజనకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఆ రకంగా మరోసారి అధిష్టానానికి ఆయన ఝలక్ ఇచ్చారు.

కిరణ్, దామోదర రాజనర్సింహ ఇలా..

కిరణ్, దామోదర రాజనర్సింహ ఇలా..

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలవడానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఇలా కనిపించారు.

దిగ్విజయ్ సింగ్‌తో కిరణ్ ఇలా..

దిగ్విజయ్ సింగ్‌తో కిరణ్ ఇలా..

ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవడానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్, పళ్లంరాజు, కెవిపి రామచందర్ రావు ఇలా కనిపించారు.

తుఫాన్ సహాయంపై ప్రారంభించి..

తుఫాన్ సహాయంపై ప్రారంభించి..

తుఫాను, వరద తాకిడి ప్రాంతాలకు అందించాల్సిన సహాయం గురించి ప్రధానికి తాము చేసిన విజ్ఞప్తిని, ప్రధాని ఇచ్చిన హామీలను వివరిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ప్రారంభించారు.

ఒక్కసారిగా మారిన స్వరం..

ఒక్కసారిగా మారిన స్వరం..

తుఫాను, వరద తాకిడి ప్రాంతాలకు అందించే సహాయం గురించి ప్రధాని ఇచ్చిన హామీలను వివరిస్తుండగా రాష్ట్ర విభజనపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న వచ్చింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన స్వరం మారింది. తాను విభజనకు అంగీకరించలేదని చెప్పి ఝలక్ ఇచ్చారు.

బొత్స అనుచిత వ్యాఖ్యలు

బొత్స అనుచిత వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

నేను మారలేదు, డిగ్గీకి ఝలక్

నేను మారలేదు, డిగ్గీకి ఝలక్

తాను విభజనకు అంగీకరించినట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతం కావచ్చునని, తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+