బడ్జెట్ 2018: మిడిల్ క్లాస్ ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యులను దృష్టిలో పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఓట్ల కోసం ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
వ్యవసాయానికి పెద్దపీట, పేదల కోసం ప్రపంచంలోనే తొలిసారి జాతీయ వైద్య పథకం, గ్రామీణానికి పెద్దపీట చూస్తుంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ఇప్పటికీ మైనార్టీ ఓట్ల పైనే ఆధారపడి ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ తొలి నుంచి మైనార్టీల పైనే ఆశలు పెట్టుకుంది. అలాగే మధ్యతరగతి, పేదవర్గాలు వారి వైపు ఉండేవారు. ఇటీవలి కాలంలో ఈ ఓటర్లు కాంగ్రెస్ నుంచి మరలుతున్నారు.
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు మధ్యతరగతి, మహిళలు, పేదలను తమ వైపు తిప్పుకునేందుకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లుగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications