వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్ల నియామకంపై సుప్రీం అక్షింతలు బేఖాతర్.. వెసులుబాటును బట్టే ఉద్యోగాలన్న కేసీఆర్

డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకంపై తొందరేమిటని సీఎం కేసీఆర్ నిలదీస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా 1.10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాక కొట్లాటేమిటని ప్రశ్నించారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'దొర బర్లు, గొర్లు అయిపోయాయి. మరి మాకు ఉద్యోగం ఎప్పుడిస్తరు' అని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును ఉద్దేశించి సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఫేస్‌బుక్‌లో ఒక నిరుద్యోగి పెట్టిన పోస్టు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోషల్ మీడియాలో చిల్లర గ్యాంగ్ పోస్టులు పెరిగిపోయాయని, హద్దుమీరితే చర్యలు తప్పవని కూడా సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాట లక్ష్యమే 'నీళ్లు, నిధులు, నియామకాలు'. లక్షల మంది నిరుద్యోగులు 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పిలుపునకు స్పందించి ఆందోళనల్లో పాల్గొన్నారు. 1200 మంది యువత ఆత్మ బలిదానం చేసిన తర్వాత 2014లో తెలంగాణ కల సాకారమైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పిస్తామని హామీ గుప్పించారు.

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి, యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. తీరా 2014లో గెలుపొంది అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ది ఉంటే ఎన్నికల హామీలు, ఉద్యోగ నియామకాలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ముందు న్యాయశాఖ అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించాకే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సర్కారీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేసిన ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లి దాటవేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

డీఎస్సీకి తొందరేముందన్న సీఎం కేసీఆర్

డీఎస్సీకి తొందరేముందన్న సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజా సంక్షేమం, అభ్యున్నతికి కార్యక్రమాల నిర్వహణ ప్రభుత్వ విద్యుక్త ధర్మం. ఆ మేరకు ప్రజలు తమ ఆకాంక్షలు వెల్లడించడం సహజ పరిణామమే. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మాత్రం కంటగింపుగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్.. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేకించి డీఎస్సీ నిర్వహణపై తనదైన శైలిలో ఎదురు ప్రశ్నలు సంధించారు. ‘డీఎస్సీ నిర్వహణకు తొందరేముంది' అని ప్రశ్నించారు.

 టీచర్ల నియామకంపై సుప్రీం అక్షింతలు ఇలా

టీచర్ల నియామకంపై సుప్రీం అక్షింతలు ఇలా

2003 తర్వాత డీఎస్సీ ప్రకటనే నిర్వహించనేలేదు. 2003లో డీఎస్సీ నిర్వహించినా నియామకాలు జరుగనే లేదు. అంటే దాదాపు 15 ఏళ్లుగా తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలే జరుగలేదు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీఎస్సీ నిర్వహిస్తే కొంచెం ఎక్కువ ఉపాధ్యాయ నియామకాలకు అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. కానీ తాజాగా సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ప్రాతిపదికనే డీఎస్సీ నిర్వహించి టీచర్లను నియమిస్తామని అన్నట్లు వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉపాధ్యాయ నియామకాలపై రెండుసార్లు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకంపై మీకు ఇంత అలసత్వమెందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అయినా మరో వాయిదా కావాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. అట్టడుగు, బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లల కోసం మెరుగైన విద్యాబోధన కోసం గురుకులాలు ఏర్పాటు చేసింది.

 ఉద్యోగ నియామకాలపై ఇలా సర్కార్ ప్లాన్

ఉద్యోగ నియామకాలపై ఇలా సర్కార్ ప్లాన్

ప్రస్తుతానికి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతుల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగుల నియామకాలు చేపడుతున్నారే తప్ప, ఆచరణలో శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకంపై మాత్రం సరిగ్గా ద్రుష్టి సారించిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదని నిరుద్యోగ యువత అంటున్నారు. ‘అసెంబ్లీ సాక్షిగా 1.10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాం.. ఇంకా కొలువుల కోసం కొట్లాటేమిటి? అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే అసెంబ్లీలో 1.10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన ప్రకటన అమలు కోసం వేచి చూడాల్సిన పరిస్థితిలో ఉండాలా? ప్రభుత్వం తనకు వెసులుబాటు కలిగిన తర్వాత, రాజకీయ ప్రయోజనాలకు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ఉచిత సలహా ఇలా

ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ఉచిత సలహా ఇలా

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపడుతున్నారు. ఇప్పటివరకు పోలీసుశాఖలో 10 వేల మంది కానిస్టేబుళ్లతోపాటు మొత్తం వివిధ శాఖల్లో 17 వేల మంది ఉద్యోగ నియామకాలు చేపట్టారు. రాష్ట్రం ఏర్పాటై మూడేళ్లు దాటిన తర్వాత 17 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు చేపడితే.. మరో ఏడాదిన్నర కాలంలో ఏ ప్రాతిపదికన మిగతా లక్ష ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకుంటారన్న విషయం సందేహ స్పదంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూడొద్దని, కేంద్రంలోనే నాలుగు కోట్ల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలు పొందాలని సలహా కూడా ఇచ్చేశారు ప్రభుత్వాధినేత. కానీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన మరుక్షణం నుంచి ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్నామని చెప్తూ వచ్చారు.

 ప్రశ్నించిన వారిపై సర్కార్ ఇలా దాడులు

ప్రశ్నించిన వారిపై సర్కార్ ఇలా దాడులు

2014లో తెలంగాణ ఏర్పాటైతే, ప్రభుత్వశాఖల్లో నియమితులైన ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయిన తర్వాత కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని పాలకులు ఆశలు గుప్పించారు. కానీ మూడేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ సంగతేమిటో గానీ, ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో క్యాడర్ స్ట్రెంత్ సంగతే తేలలేదు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే వారిని మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల బదిలీకి చేసిన పోరాటమేమిటని ఎదురుదాడికి దిగడం తెలంగాణ ప్రభుత్వ అధినేతలకు అలవాటుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Telangana CM KCR attacking opposition parties on employment in government departments. His government will give employment its conditions. Particularly he has attacking on DSC notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X