వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చేసిన సీబీఐ ఎఫ్ఐఆర్: ఈ ఏడాదిలోనే పీఎన్బీ ‘నయామోసం’ మూలం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.11,400 కోట్ల కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇప్పటికే మొండి బకాయిలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయ బ్యాంకింగ్ రంగానికి.. పీఎన్బీ కుంభకోణం గుదిబండలా మారుతున్నది. దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ పీఎన్బీలో సంచలనం సృష్టించిన మొత్తం రూ.11,400 కోట్ల కుంభకోణం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లోనేనని సీబీఐ ఎఫ్‌ఐఆర్ చెబుతున్నది.

దీంతో ఈ కుంభకోణానికి మూలాలు 2011లోనే ఏర్పడ్డాయని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు చేసిన ఆరోపణలు నిరాధారాలు తేలాయి. ఈ కుంభకోణం మూలాలు 2011లో ఉన్నాయని, ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనమని బీజేపీ అధికార ప్రతినిధులు, మంత్రులు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

2011 నుంచి స్కాం జరిగితే రూ.11,400 కోట్లపైనే ఉంటుందని అంచనా
ఒకవేళ ఈ కుంభకోణానికి 2011లోనే బీజం పడితే దీని విలువ రూ.11,400 కోట్లను మించిపోతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటిదాకా నలుగురు పీఎన్బీ అధికారులను సీబీఐ ప్రశ్నించింది. వీరిలో 2015 ఫిబ్రవరి నుంచి 2017 అక్టోబర్ మధ్య నారీమన్ పాయింట్ శాఖ చీఫ్ మేనేజర్‌గా పనిచేసిన బిచు తివారీ, మే 2016 మే నుంచి 2017 అక్టోబర్ మధ్య బ్రాడీ హౌస్ శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించిన, ప్రస్తుతం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా ఉన్న సంజయ్ కుమార్ ప్రసాద్, 2015 నవంబర్ నుంచి 2017 జూలై మధ్య సంయుక్త ఆడిటర్‌గా వ్యవహరించిన మోహిందర్ కుమార్ శర్మ, 2014 నవంబర్ నుంచి 2017 డిసెంబర్ వరకు సింగిల్ విండో ఆపరేటర్‌గా ఉన్న మనోజ్ కారత్‌ ఉన్నారు.

 Entire Punjab National Bank Scam Took Place in 2017-18, Says CBI FIR

ఇలా ఎల్వోయూల దుర్వినియోగం
పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధానమైనవి ఎల్‌వోయూలే. వీటి ఆధారంగానే ఇంత పెద్ద అక్రమ లావాదేవీలు జరిగాయి. సహచర భారతీయ బ్యాంకులకు చెందిన విదేశీ శాఖలకు తమ ఖాతాదారులకు రుణ సదుపాయం లేదా నిధులను మంజూరు చేయాలని దేశంలోని ఇతర ఏదైనా బ్యాంకు జారీ చేసేదే లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ లేదా అండర్‌స్టాండింగ్ (ఎల్‌వోయూ). ఇక ఈ కేసులో నీరవ్ మోదీ సంస్థలకు మొత్తం 293 ఎల్‌వోయూలు జారీ అయినట్లు సీబీఐకి పీఎన్‌బీ తెలియపరుచగా, జనవరి 31న దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో 150 ఎల్‌వోయూలు, తాజాగా దాఖలైన మరో ఎఫ్‌ఐఆర్‌లో 143 ఎల్‌వోయూల గురించి పీఎన్‌బీ.. సీబీఐకి వివరించింది. మరో 224 విదేశీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)లున్నాయని కూడా కొత్త ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్నది.

143 ఎల్వోయూలతో దిగుమతుల కోసం రూ.3031 కోట్లు చెల్లింపు
143 ఎల్‌వోయూలు-బ్యాంక్ గ్యారెంటీల ద్వారా రూ.3,031 కోట్ల విదేశీ దిగుమతి చెల్లింపుల కోసం జారీ అయ్యాయి. 224 ఎల్‌వోసీల ద్వారా రూ.1,798 కోట్ల నిధులను కాజేశారు. అంతకుముందు వెల్లడైన 150 ఎల్వోయూలతో రూ.6,500 కోట్లకుపైగా నిధులు గోల్‌మాల్ అయ్యాయి. కాగా, గోకుల్‌నాథ్ శెట్టీ, మనోజ్ కారత్‌లు ఎటువంటి మార్గదర్శకాలను అమలు చేయకుండా, నిబంధనలను ఉల్లంఘించి ఎల్‌వోయూలను నీరవ్ మోదీ సంస్థలకు జారీ చేశారని సీబీఐకి పీఎన్‌బీ చెప్పింది. ఇంకా బయటకురాని ఇలాంటి ఎల్‌వోయూలే ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పీఎన్‌బీ ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నది.

English summary
New Delhi: The entire Rs 11,400 crore Punjab National Bank (PNB) scam happened between 2017 and 2018, according to the CBI FIR. While ministers and BJP spokespersons came out all guns blazing against the Congress and claimed that the scam began in 2011, so far it appears the CBI investigation is limited to just 2017-2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X