వర్కింగ్ హాలీడేగా: ప్రణబ్ 'టి' పార్టీ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో టీ పార్టీ ఇచ్చారు. ప్రణబ్ శీతాకాల విడిది ఈ రోజుతో ముగియనుంది. ప్రణబ్ హైదరాబాద్‌లో పదమూడు రోజుల గడిపారు. ఒకవైపు తెలంగాణావాదులు, మరోవైపు సీమాంధ్ర నేతలు వరుసగా రాష్ట్రపతిని కలిసి హడావుడి చేశారు. పరిపాలనకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది.
తెలంగాణ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రాజ్యాంగం ప్రకారం రాష్టప్రతి ద్వారా రాష్ట్ర శాసనసభకు వచ్చింది. ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి నేరుగా రాష్టప్రతి స్వయంగా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. ఈ విషయం తెలంగాణకు చెందిన నాయకులతో పాటు సీమాంధ్రకు చెందిన నాయకులకు తెలిసిందే.
అయినప్పటికీ, రాష్టప్రతి హైదరాబాద్‌లో కొద్ది రోజులు గడిపేందుకు రాగా, ఇరుప్రాంతాలకు చెందిన నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు తదితరులు పోటాపోటీగా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు అందించారు. శీతాకాల విడిది సమయంలో ప్రణబ్ ఇరు ప్రాంతాల నేతలు వరుసగా కలవడంతో బిజీగా మారిపోయారు.
హైదరాబాద్‌లో 13 రోజుల పాటు బస చేసిన ప్రణబ్ మంగళవారం తిరిగి ఢిల్లీ వెళ్లిపోతున్నారు. ఢిల్లీ నుండి వైమానిక ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రణబ్, తిరిగి ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వెళుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఉదయం 10-11 గంటల మధ్య ఆయన ఇక్కడి నుండి బయలుదేరతారు.

రాష్ట్రపతి 1
హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలోని ఏర్పాటు చేసిన టీ పార్టీలో ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముచ్టటిస్తున్న దృశ్యం.

రాష్ట్రపతి 2
హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలోని ఏర్పాటు చేసిన టీ పార్టీలో ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు టిజి వెంకటేష్, జానా రెడ్డి, శ్రీధర్ బాబు, గవర్నర్ నరసింహన్ దంపతులు తదితరులు.

రాష్ట్రపతి 3
హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలోని ఏర్పాటు చేసిన టీ పార్టీలో ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ దంపతులు తదితరులు.

రాష్ట్రపతి 4
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో టీ పార్టీ ఇచ్చారు. ప్రణబ్ శీతాకాల విడిది ఈ రోజుతో ముగియనుంది. ప్రణబ్ హైదరాబాద్‌లో పదమూడు రోజుల గడిపారు. ఈ టీ కార్యక్రమంలో ప్రముఖ ఫ్లూట్ విద్వాంసురాలు జయప్రద రామ్మూర్తి కచేరీ, కూచిపూడి కళాకారిణి డాక్టర్ యశోదా ఠాకూర్ నృత్యం అలరించింది.

రాష్ట్రపతి 5
ప్రణబ్ ముఖర్జీ తాను హైదరాబాదులో ఉన్నన్ని రోజులు ఎవరు తనతో కలిసేందుకు వచ్చినా లేదనకుండా ఆమోదించారు. రెండు ప్రాంతాలకు చెందిన వారు తమ భావాలను ఆయన ముందు ఉంచారే తప్ప, ప్రణబ్ ముఖర్జీ మాత్రం మాటవరసకు కూడా ఎవరికి అనుకూలంగా కూడా మాట్లాడలేదని తెలిసింది. ప్రణబ్‌ను కలిసిన సిపిఐ నేతల దృశ్యం.

రాష్ట్రపతి 6
రాష్ట్రపతిని కలిసిన అనంతరం... తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ వారికి భరోసా ఇచ్చినట్టు తెలంగాణవాదులు చెప్పుకోగా, రాష్ట్ర విభజన జరగకుండా చూస్తామంటూ తమకు రాష్ట్రపతి హామీ ఇచ్చారని సీమాంధ్ర నేతలు చెప్పుకున్నారు.

రాష్ట్రపతి 7
సోమవారం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రులు తదితరులు తెలంగాణకు అనుకూలంగా వినతిపత్రాలు ఇవ్వడమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకణ ముసాయిదా బిల్లు- 2013'ను శాసనసభలో చర్చకు పంపించినందుకు రాష్టప్రతికి కృతజ్ఞతలు తెలియచేశారు.

రాష్ట్రపతి 8
తెలంగాణ ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లేలా చూడాలంటూ, శాసనసభ, శాసనమండలిలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దంటూ రాష్ట్రపతిని డి శ్రీనివాస్ కోరారు.

రాష్ట్రపతి 9
సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పార్టీ నాయకులతో కలిసి భేటీ అయిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

రాష్ట్రపతి 10
రాష్ట్రపతి నిలయంలో నక్షత్ర వాటిక గార్డెన్‌ను ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. రాబోయే ఆరు నెలల్లో మొత్తం 27 నక్షత్రాల పేర్లతో ఇక్కడ మొక్కలు నాటుతారు.

రాష్ట్రపతి 11
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తదితరులు ఫోటో దిగుతున్న దృశ్యం.

రాష్ట్రపతి 12
తెలంగాణ ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లేలా చూడాలంటూ, శాసనసభ, శాసనమండలిలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దంటూ రాష్ట్రపతిని డి శ్రీనివాస్ కోరారు.












Click it and Unblock the Notifications