సమస్యల సుడిగుడంలో విజయన్ సర్కార్
పినరయి విజయన్ సారథ్యంలో కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయింది. పినరయి విజయన్ ప్రభుత్వం తాము చెప్పుకో తగ్గ విజయాలు సాధించామని వాదిస్తోంది.
తిరువనంతపురం: పినరయి విజయన్ సారథ్యంలో కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయింది. పినరయి విజయన్ ప్రభుత్వం తాము చెప్పుకో తగ్గ విజయాలు సాధించామని వాదిస్తోంది. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ సంస్క్రుతి కల్పించామని, అవినీతి రహిత సుపరిపాలనను అందించడమే తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం అని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ ప్రజాతంత్ర కూటమి (యూడీఎఫ్) విపక్ష కూటమి మాత్రం అన్ని రంగాల్లోనూ ఎల్డీఎఫ్ సర్కార్ విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నది. ప్రత్యేకించి సీఎం విజయన్ పనితీరుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఆయన కేరళ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా కఠినంగానే వ్యవహరిస్తున్నారని, సీఎం హోదాలో సామరస్య పూర్వకంగా వ్యవహరించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకించి ఆర్థిక శాఖ మంత్రిగా టీఎం థామస్ ఇజాక్ నియామకంతోపాటు ఆర్థిక వ్యవహారాల సలహదారుగా గీతా గోపీనాథ్ సహా ఎనిమిది మంది సలహదారులను కేరళ సీఎం పినరయి విజయన్ నియమించుకోవడంపై విపక్ష పార్టీలు దాడి చేస్తున్నాయి.
తొలి ఏడాదిలోనే పినరయి విజయన్ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారిలో ఈపీ జయరాజన్ సీఎం విజయన్‌కు అత్యంత సన్నిహితులన్న పేరు ఉన్నది. అశ్రిత పక్షపాతానికి, సొంత వారి పట్ల అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో జయరాజన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక మరో మంత్రి ఏకే శశీంద్రన్ లైంగిక పరమైన వివాదాల కారణంగానే మంత్రిగా వైదొలిగారు. ఇక మున్నార్‌లో అక్రమాలకు పాల్పడే అధికారులకు మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడుతున్నది.

జిష్ణు ప్రణయ్ కేసులో విజయన్ ఇలా
అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్)లో ప్రధాన మిత్ర పక్షాలు సీపీఎం, సీపీఐ మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా కొనసాగుతున్నది. సీపీఐ నాయకుడికి రెవెన్యూ శాఖ ఇవ్వడంపై ఇరు పార్టీల్లోనూ అభ్యంతరాలు, పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభం నుంచి సీపీఎం, సీపీఐ మధ్య పలు అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రెండు పార్టీల నాయకుల మధ్య గల విభేదాలు వారు తొలి నుంచి తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తూనే ఉన్నాయి. జిష్ణు ప్రణయ్ కేసు వ్యవహరంలో పినరయి విజయన్ ప్రభుత్వం అనుసరించిన విధానం సరిగ్గా లేదని విమర్శలు వచ్చాయి. అంశం మరింత వేడెక్కి వివాదాస్పదం కాకుండా చూసుకోవడంలో విజయన్ పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ ఆమెను సీఎం కలుసుకుని ఓదార్చగలిగితే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

డీజీపీగా నియామకం విజయన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ
ఇక అధికార సీపీఎంకు కొత్తగా లభించిన స్నేహితుడు, ఆర్థికశాఖ మాజీ మంత్రి కేఎం మణి కూడా తొందరగానే తప్పుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. గత యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా మణి ఆర్థిక లావాదేవీలపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం అస్త్రాలు సంధించడమే దీనికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. బార్ల కుంభకోణంలో చిక్కుకున్న కేఎం మణిపై ఆరోపణలు వచ్చాయి. గత అసెంబ్లీలో మణి బడ్జెట్ ప్రతిపాదించకుండా విపక్షం అడ్డుకోవడానికి ప్రయత్నించబోయి స్పీకర్ చైర్‌ను ఎల్డీఎఫ్ సభ్యులు లాగేస్తే.. ఇదే సీపీఎం మణి పార్టీకి మద్దతునిస్తున్నది. త్వరలో కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నందున మణి పార్టీకి సీపీఎం మద్దతు ఇవ్వడం దాని మిత్ర పక్షం సీపీఐ వ్యతిరేకిస్తున్నది. కేరళ రాష్ట్ర డీజీపీగా టీ పీ సెన్‌కుమార్‌ను తిరిగి నియమిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు.

గత ప్రభుత్వ అవినీతిపై విజయన్ ఇలా
గత ఐదేళ్లుగా యూడీఎఫ్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి విధానాలు అవలంభించిందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పూర్తి రాజకీయ వాతవరణాన్నితనకు అనుకూలంగా యూడీఎఫ్ ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపించారు. గత యూడీఎఫ్ ప్రభుత్వంలో పలువురు మంత్రులు అవినీతి కేసుల్లో కొనసాగుతూ ఉన్నా నిస్సిగ్గుగా ప్రభుత్వంలోనే కొనసాగారని విజయన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు తమ వారసుల కోసం తప్పిదాలకు పాల్పడే వారని, కానీ ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో అందుకు తావులేదని విజయన్ స్పష్టంచేశారు.ఏడాది కాలంగా రాజకీయాలను శుద్ధి చేస్తున్నామన్నారు. కేరళలో కొబ్బరి పీచు, జీడిపప్పు రంగ పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నామని విజయన్ వివరించారు. కాపెక్స్ ఆధ్వర్యంలో 18 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించింది. 2.30 లక్షల స్కూల్ యూనిఫామ్‌లు తయారుచేసేందుకు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చింది. సంక్షేమ పెన్షన్ల కోసం రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. లైఫ్ మిషన్ కింద ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి సౌకర్యం కల్పిస్తున్నది.

63 రంగాల్లో ఎల్డీఎఫ్ సర్కార్ వైఫల్యంపై చెన్నితల ఇలా
పినరయ్ విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ పనితీరుపై అసెంబ్లీలో విపక్ష నేత రమేశ్ చెన్నితల చార్జిషీట్ దాఖలు చేశారు. అన్ని రంగాల్లో విజయన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. 63 రంగాల్లో విఫలమైందని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై రమేశ్ చెన్నితల విమర్శించారు. ఏడాది కాలంలో ఒక్క అభివ్రుద్ది పథకం కూడా చేపట్టిన దాఖాలాలు లేవన్నారు. కోచి మెట్రో, కన్నూర్ విమానాశ్రయాలు గత యూడీఎఫ్ ప్రభుత్వ వారసత్వానికి నిదర్శనమన్నారు.
విజయన్ ప్రభుత్వం పూర్తిగా ఫాసిస్టు విధానాలు అవలంభిస్తున్నదని చెన్నితల పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రారంభించడంలోనే సీఎం విజయన్ నిమగ్నమయ్యారని మండి పడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రి ఈపీ జయరాజన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని విపక్ష నేత రమేశ్ చెన్నితల ప్రశ్నించారు. సీఎం విజయన్ అవినీతి పరులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతస్థాయి వర్గాల సంస్థ చైర్మన్‌గా ఆర్ బాలక్రుష్ణ పిళ్లై ఎందుకు నియమించారని ప్రశ్నించారు. కేరళలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications