వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వరుస ఓటములతో వైసీపీకి అగ్ని పరీక్ష, అభ్యర్థెవరు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. అయితే కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి అగ్నిపరీక్షగా నిలిచాయి.

' ఎక్కడినుండైనా పోటీకి రెఢీ, మా వర్గం బలహీనం,'' ఫ్యాక్షన్‌ను జగన్ రెచ్చగొడుతున్నారు'' ఎక్కడినుండైనా పోటీకి రెఢీ, మా వర్గం బలహీనం,'' ఫ్యాక్షన్‌ను జగన్ రెచ్చగొడుతున్నారు'

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. మరో వైపు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడ టిడిపి విజయం సాధించింది.

పవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవిపవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవి

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాకు ఆమోదముద్ర పడడంతో ఎన్నిక అనివార్యంగా మారింది.

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. టిడిపి నుండి వైసీపీలో చేరిన సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి.వైసీపీకి బలమున్నప్పటికీ ఈ స్థానంలో టిడిపి విజయం సాధించింది. ఆ సమయంలో టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ నుండి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి ఈ ఎన్నికలకు ముందే గుండెపోటుతో చనిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు పోటాపోటీ వ్యూహలను రచిస్తున్నాయి.ఈ ఎన్నిక వైసీపీకి మాత్రం అగ్నిపరీక్షగానే మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 వైసీపీ అభ్యర్థి ఎవరు

వైసీపీ అభ్యర్థి ఎవరు

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి గౌరు వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు.అయితే ఈ స్థానానికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి మరోసారి బరిలోకి దిగుతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నుండి పోటీ చేసేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి ప్లాన్ చేసుకొంటున్నారు. ఈ తరుణంలోనే గౌరు వెంకట్‌రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తిని చూపడంలేదంటున్నారు. అయితే ఇంకా ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

 పార్టీ నేతలతో సమావేశం కానున్న జగన్

పార్టీ నేతలతో సమావేశం కానున్న జగన్

పాదయాత్రలోనే కర్నూల్ జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రెండు మూడు రోజుల్లో కర్నూల్ జిల్లా పార్టీ నేతలతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశం కానున్నారు. కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయమై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి నెలకొంది. 2018, జనవరి 12వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి.

 శిల్పా రవి కిషోర్ రెడ్డి పోటీ చేస్తారా

శిల్పా రవి కిషోర్ రెడ్డి పోటీ చేస్తారా

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవికిషోర్‌రెడ్డి పోటీ చేస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. 2019 ఎన్నికల్లో నంద్యాల నుండి శిల్పా మోహన్ రెడ్డి, శ్రీశైలం నుండి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేసేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. అయితే అదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవికిషోర్‌ రెడ్డిని కూడ బరిలోకి దింపే అవకాశాలు కూడ ఉన్నాయనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జగన్ తో పార్టీ నేతల సమావేశం తర్వాత ఎవరు పోటీ చేస్తారనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం కూడ లేకపోలేదు.

English summary
kurnool leaders will meet Ysrcp chief Ys Jagan after two days for MLC elections. Jagan will be finalized contesting candidate for MLC elections in that meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X