రన్: సోనియాకు కోరలు, బ్యాట్‌మ్యాన్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆదివారం సెలవు రోజుల్లో నిర్మానుష్యంగా ఉండే పట్టణాలు, నగరాలు సమైక్యవాదుల సమైక్య రన్‌తో పోటెత్తాయి. సమైక్య హారాలు కడుతూ, తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములకి వందనాలు చెబుతూ, అన్ని వర్గాల ప్రజలు పరుగు పెట్టారు.
'ఐక్యతతో వేద్దాం అడుగు-సమైక్యాంధ్ర కోసం చేద్దాం పరుగు' అంటూ విజయవాడలో సమైక్యవాదులు రోడ్లపై కదం తొక్కారు. 'సమైక్యత మన పథం' అంటూ సమైక్య రన్‌లో పరుగులు పెట్టారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, జిల్లా మంత్రి పార్థసారథి ముందు వరసలో నిలిచారు. ఎమ్మెల్యేలు యలమంచిలి రవి, మల్లాది విష్ణు పాలుపంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కేశినేని నాని, దేవినేని చంద్రశేఖర్ తదితరులు ఐదు కిలోమీటర్ల రన్‌లో పాలుపంచుకున్నారు.
బిల్లు ప్రవేశ పెట్టవద్దంటూ నెల్లూరు జిల్లాలో పలుచోట్ల రాస్తారోకో, మానవహారం, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వెంకటగిరిలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన పార్లమెంటు సభ్యు చింతా మోహన్‌ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. గూడూరులో విద్యార్థులు మానవహారం చేపట్టారు. రోడ్లపై మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.

విజయవాడలో ఎపిఎన్జీవోలు
ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా నేతృత్వంలో విజయవాడలో ఆదివారం సాయంత్రం సమైక్య రన్ నిర్వహించారు. ఈ రన్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాగ్రెసు పార్టీల నాయకులు, విద్యార్థినీవిద్యార్థులు, ఎన్జీవోలు, మహిళలు పాలుపంచుకున్నారు.

గజల్ శ్రీనివాస్
విజయవాడలో సమైక్య రన్ సందర్భంగా ఆదివారంనాడు గజల్ శ్రనివాస్ ఇలా ప్రదర్శన ఇచ్చారు. ఆయన బృందం డప్పులు వాయిస్తూ ఇలా.

సోనియా కోరలతో..
సమైక్య రన్‌లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటానికి కోరలు పెట్టి, ఆంధ్రప్రదేశ్ చిత్రాన్ని మింగుతున్నట్లు చూపుతూ ప్రదర్శించారు.

తెలుగుతల్లి వేషం..
తెలుగుతల్లి వేషంలో యువతి ఇలా కనిపించగా, సమైక్యాంధ్రను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ఇలా.

పాప సమైక్యాంధ్ర జెండా..
రన్‌కు ముందుగా విజయవాడ స్వరాజ్యమైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఓ పాప ఇలా జై సమైక్యాంధ్ర జెండాను ప్రదర్శిస్తూ..

లగడపాటి రాజగోపాల్ ఇలా..
విజయవాడ పార్లమెంటు సభ్యుడదు లగడపాటి రాజగోపాల్ అగ్రభాగాన నిలిచారు. విజయవాడ స్వరాజ్య మైదానం నుంచి రన్ ప్రారంభమైంది.

ముక్కలు చేయవద్దు..
తెలుగుజాతిని ముక్కలు చేయవద్దంటూ ఓ పోస్టర్‌ను విజయవాడ స్వరాజ్య మైదానంలో ఇలా ప్రదర్శించారు.

విశాఖ సాగర తీరం..
విశాఖ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, సమైక్య రాష్ట్ర పరిర క్షణ వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా, ప్రజా సంఘాలకు చెందిన వేలాది మంది పాలుపంచుకున్నారు.

సమైక్య సూపర్ మాన్
విశాఖపట్నంలో సమైక్యాంధ్ర రన్‌లో భాగంగా ఈ రకంగా ప్రదర్శన ఇచ్చారు. సమైక్య సూపర్ మన్ ఇలా దర్శనమిచ్చాడు.

పచ్చదనం ఇలా..
రామకృష్ణ బీచ్ నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న వుడా పార్కు వరకూ సాగిన ర్యాలీని మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు జెండా ఊపి ప్రారంభించారు.

ఉత్సాహంగా సమైక్య పరుగు
విభజనను వ్యతిరేకిస్తూ విశాఖ సాగరతీరంలో నిర్వహించిన రన్‌లో వేలాది మంది పాల్గొన్నారు. సమైక్యవాదులు పచ్చరంగు టీ షర్టులు ధరించడంతో బీచ్ రోడ్డు ఆకుపచ్చగా మారిపోయింది.

తిరుపతిలో ఇలా..
తిరుపతిలోని రైల్వే స్టేషన్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం కూడలి వరకూ పరుగు తీసి మానవహారం నిర్మించారు. చిత్తూరు గాంధీ విగ్రహం కూడలిలో సమైక్య పరుగును ఎమ్మెల్యే సీకేబాబు ప్రారంభించారు.

సమైక్య డప్పు..
తిరుపతిలో సమైక్య రన్ సందర్భంగా కళాకారులు ఇలా ప్రదర్శన ఇచ్చారు. ఆకుపచ్చ చొక్కాలతో ప్రదర్సనకారులు విభజనను వ్యతిరేకించారు.

మాగంటి బాబు ఇలా..
తిరుపతిలో జరిగిన సమైక్య రన్ పరుగులో భాగంగా మాగంటి బాబు ఇలా పచ్చ టీ షర్ట్ వేసి, టోపీ పట్టి తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ఎన్టీఆర్ వేషధారి..
ఓ కళాకారుడు ఎన్టీఆర్ వేషధారణలో సమైక్యాంధ్ర అవసరాన్ని తెలియజేస్తూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ డైలాగులు చెప్పాడు.

తెలుగుతల్లికి నివాళులు..
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహానికి నివాళులు అర్పించారు. సమైక్యాంధ్రను కాపాడాలని నినదించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రన్‌లో భారీ సంఖ్యలో సమైక్యవాదులు హాజరై రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య సారథ్యంలో సాగిన ఈ రన్‌లో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలు పార్టీల నాయకులు, జేఏసీ నేతలు, ఎన్‌జీవో నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాకుళంలో ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్యరన్ ఉత్సాహంగా సాగింది. విజయనగరం పట్టణంలో అయోధ్య మైదానం నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా పోలీస్ బ్యారెక్స్ వద్ద రన్ ముగిసింది.
'ముందుకు వేద్దాం అడుగు.. సమైక్యాంధ్రకు చేద్దాం పరుగు' అంటూ తూర్పు గోదావరి జిల్లాలో యువత పరుగులు తీసింది. కాకినాడ కలెక్టరేట్ నుంచి ఉద్యోగులు, సమైక్యవాదులు, విద్యార్థులతో ప్రారంభమైన రన్ బాలాజీ చెరువు సెంటర్ వరకు కొనసాగి తిరిగి కలెక్టరేట్‌కు చేరుకుంది. బిల్లును పార్లమెంటులోని అన్ని రాజకీయ పక్షాలూ తిప్పి కొట్టాలంటూ కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంలో సమైక్య రన్ జరిగింది.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టరాదంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన రన్‌లో జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ ఎల్.వి.సాగర్‌తోపాటు ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 5కె రన్, కొన్ని ప్రాంతాల్లో 3కె రన్ నిర్వహించారు. మరోవైపు రాజమండ్రి నగరంలో సమైక్య రన్ సాగింది.
చిత్తూరు జిల్లా తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు పీలేరు, మదనపల్లె పట్టణాలలో సమైక్య పరుగుకు వేలాదిమంది విద్యార్థులతో పాటు సమైక్యవాదులు హాజరయ్యారు. పుంగనూరులో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కెసిఆర్, దిగ్విజయ్‌సింగ్ తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
అనంతపురం నగరం, హిందూపురం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఏక కాలంలో సమైక్య రన్ నిర్వహించారు. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ నుంచి ప్రారంభమైన పరుగు టవర్ క్లాక్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ మీదుగా సాగింది. హిందూపురం పట్టణంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సాగిన రన్ ఎంజీఎం మైదానం నుంచి సద్బావన సర్కిల్ వరకూ కొనసాగింది.












Click it and Unblock the Notifications