వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కూటమికి చెక్, కేజ్రీ అంతంతే: పంజాబ్‌లో కాంగ్రెస్ కల ఫలిస్తుంది!

ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఒపీనియన్ పోల్‌లో పంజాబ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశముందని తేలింది.

|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్: ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఒపీనియన్ పోల్‌లో పంజాబ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశముందని తేలింది. 117 సీట్లున్న పంజాబ్‌లో కాంగ్రెస్ 56 నుంచి 62 సీట్లు గెలుచుకోవచ్చని తేలింది. దశాబ్దాల తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ కల ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రివర్స్: అఖిలేష్‌కు తండ్రి దెబ్బ, బీజేపీ హవా.. ఇదీ ఒపీనియన్ పోల్స్...రివర్స్: అఖిలేష్‌కు తండ్రి దెబ్బ, బీజేపీ హవా.. ఇదీ ఒపీనియన్ పోల్స్...

కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశముందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది ఆ పార్టీకి, రాహుల్ గాంధీకి అతి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో ఉండే అవకాశముందని సర్వేలో తేలింది. ఈ పార్టీ 36-41 సీట్లు గెలుచుకోవచ్చు. ఇక, అధికారంలో ఉన్న అకాలీ దళ్ - బీజేపీ కూటమికి కేవలం 18 -22 సీట్లు గెలుచుకుంటుంది.

యూపీ బీజేపీదే, కానీ అది పెద్ద సవాల్: మోడీ కంటే అఖిలేష్ బెస్ట్!యూపీ బీజేపీదే, కానీ అది పెద్ద సవాల్: మోడీ కంటే అఖిలేష్ బెస్ట్!

దూసుకెళ్లిన కాంగ్రెస్

దూసుకెళ్లిన కాంగ్రెస్

అంతకుముందు 2016 అక్టోబర్ నెలలో సర్వే చేశారు. అప్పటి కంటే తాజా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు పెరిగాయి. అదే సమయంలో అంతకుముందు ముందంజలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజా సర్వేలో వెనుకబడిపోయింది.

తగ్గిన ఏఏపీ హవా

తగ్గిన ఏఏపీ హవా

గత మూడు నెలల్లోనే.. అంటే అక్టోబరులో చేసిన సర్వేకు, తాజా సర్వేకు పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు సీట్లు కోల్పోయింది. గత కొద్ది రోజులుగా స్థానిక నాయకులు విమర్శలకు గురి కావడం, ముఖ్య నేతలు పార్టీని వీడటం జరుగుతోంది.

కాస్త పుంజుకున్న అకాలీదళ్

కాస్త పుంజుకున్న అకాలీదళ్

అక్టోబర్ నెల కంటే తాజా సర్వేలో అకాలీ దళ్ పుంజుకుంది. ఇందుకు నాయకుల ప్రచారం కొంత కలిసి వచ్చింది. అక్టోబర్ నెలలో అకాలీ దళ్ - బీజేపీ ఓట్ షేర్ 22 శాతంగా ఉండగా, తాజా డిసెంబర్ నెల సర్వేలో 24 శాతానికి పెరిగింది.

అమరీందర్ వైపు మొగ్గు

అమరీందర్ వైపు మొగ్గు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందున్నారు. 34 శాతం మంది ఆయన కావాలని కోరుకుంటున్నారు. 22 శాతం మంది ప్రకాశ్ సింగ్ బాదల్, అరవింద్ కేజ్రీవాల్ 16 శాతంతో ఉన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన పంజాబ్‌లో మూడో స్థానంలో నిలిచారు.

అదే దెబ్బ తీసింది

అదే దెబ్బ తీసింది

పంజాబ్‌లో డ్రగ్స్ ఇష్యూ ముఖ్యంగా మారింది. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది డ్రగ్స్‌నే పెద్ద సమస్యగా చెప్పారు. అదే సమయంలో, ఈ సమస్యకు కారణంగా అధికార పార్టీ అని 69 శాతం మంది చెప్పారు. అలాగే, ఉద్యోగం (41 శాతం), అభివృద్ధి (33 శాతం), డ్రగ్ కంట్రోల్ (8) వంటి సమస్యలను పరిగణలోకి తీసుకొని ఓటేస్తామని చెప్పారు.

నోట్ల రద్దు

నోట్ల రద్దు

ఉత్తర ప్రదేశ్‌లో నోట్ల రద్దు కారణంగా తాము ఇబ్బంది పడ్డామని 58 శాతం మంది చెప్పగా, పంజాబ్‌లో 2 శాతం మంది ఇబ్బంది పడినట్లు చెప్పారు. అయితే, 72 శాతం మంది నోట్ల రద్దును స్వాగతించడం గమనార్హం.

యువత మద్దతు ఏఏపీకి

యువత మద్దతు ఏఏపీకి

యువతలో 32 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏఏపీకి మొత్తంగా 29 శాతం మద్దతు ఉంది. అయితే, మొత్తంగా కంటే.. యువత మద్దతు మూడు శాతం ఎక్కవగా ఉంది. ఏఏపీకి ప్రామినెంట్ సిక్కు ముఖ్య నేత లేనప్పటికీ.. సిక్కు ఓటర్లలోకి బాగానే దూసుకెళ్లింది. దాదాపు ముప్పై శాతం మంది అప్పర్ క్యాస్ట్ సిక్కులు కేజ్రీవాల్‌కు ఓటేస్తామని చెప్పారు.

ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న అకాలీదళ్‌కు ఇటు గ్రామీణ లేదా అటు పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది.

కాంగ్రెస్ వైపు అప్పర్ క్యాస్ట్ హిందువులు

కాంగ్రెస్ వైపు అప్పర్ క్యాస్ట్ హిందువులు

అంతే మొత్తం (ముప్పై శాతం) కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. పంజాబ్‌లో అప్పర్ క్యాస్ట్ హిందువులు, ఓబీసీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండటం గమనార్హం. అప్పర్ క్యాస్ట్ హిందువులు, ఐబీసీలు, ఎస్సీ సిక్కుల మద్దతు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేలా ఉంది. దీనికి తోడు డ్రగ్స్ ఇష్యూ కలిసి వస్తుందంటున్నారు.

సిద్ధు చేరికతో మరింత లాభం

సిద్ధు చేరికతో మరింత లాభం

కాగా, సర్వేలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తేలింది. ఇప్పుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు కూడా ఆ పార్టీలో చేరనున్నారు. ఇది ఆ పార్టీకి మరింత లబ్ధి చేకూర్చనుంది. సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరితే మరిన్ని ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశముంది.

English summary
Congress could bag between 56-62 seats in the 117 seat stateassembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X