వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ యంగ్ టర్క్‌లే ‘కీ’లకం.. గుజరాత్‌లో కాంగ్రెస్ ‘మహా కూటమి’ ఏర్పాటు యత్నాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు మహా కూటమి యత్నాలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ వ్యవహారాల ఇన్ చార్జి అశోక్ గెహ్లాట్, జీపీసీసీ అధ్యక్షుడు భర

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌లో పాటిదార్లు, ఓబీసీలు, దళిత సామాజి వర్గాల యువ నేతలు గుజరాత్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి రాష్ట్రంలోని అధికార బీజేపీ వర్గాలు రకరకాల ప్రయత్నిస్తున్నాయి. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్, రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్ జిగ్నేశ్ మేవానీ ఇప్పటికే బీజేపీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా ప్రకటించారు. ఓబీసీల హక్కుల కోసం పోరాడుతున్న క్షత్రియ ఠాకూర్ సేన కన్వీనర్ అల్పేశ్ ఠాకూర్ తన వైఖరిని బయటపెట్టలేదు.
సంపన్నులుగా పేరొందిన పాటిదార్లను తమ విశ్వాసంలోకి తెచ్చుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నారు కమలనాథులు. అందులో భాగంగా పటేళ్ల ఆందోళన సందర్భంగా పెట్టిన పోలీసు కేసులు ఉపసంహరిస్తున్నారు. కానీ రిజర్వేషన్ల డిమాండ్ విషయమై 'పాస్' కన్వీనర్ హార్దిక్ పటేల్ తన మంకుపట్టు వీడటం లేదు. రాష్ట్ర జనాభాలో దళితులు 16.6, గిరిజనులు 8.6 శాతం ఉన్నారు. ఓబీసీలు సుమారు 51 శాతం మందితో 182 అసెంబ్లీ స్థానాల పరిధిలో 110 స్థానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని హార్దిక్ పిలుపు

బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని హార్దిక్ పిలుపు

భావోద్వేగ పూరితంగా ఉన్న పాటిదార్ల యువత ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ఎల్లవేళలా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని చెబుతున్నారు. తమ రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని హార్దిక్ పటేల్ తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పరోక్షంగా తన మద్దతు దారులకు సూచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని స్పష్టంగా చెప్తూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచిస్తున్నారు.

రాజకీయాలకు ఇలా ఇరుసుగా మారిన దళితులు, ముస్లింలు

రాజకీయాలకు ఇలా ఇరుసుగా మారిన దళితులు, ముస్లింలు

మరోవైపు రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్ జిగ్నేశ్ మేవానీ విభిన్నంగా స్పందిస్తూ గుజరాత్ రాష్ట్రంలో గానీ, భారతదేశంలో గానీ బీజేపీ మినహా ఏ రాజకీయ పార్టీ కూడా హిందీ గురించి మాట్లాడబోదని, ఆరెస్సెస్ రాజకీయ విభాగమే బీజేపీ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో మార్పులకు జరిగే ఏ ప్రయత్నాన్నైనా తాము గట్టిగా వ్యతిరేకిస్తామని జిగ్నేశ్ మేవానీ స్పష్టం చేశారు. భారత్ ప్రజాతంత్ర సోషలిస్టు లౌకిక గణతంత్ర దేశంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా దళితులు, ముస్లింలు రాజకీయాలకు ఇరుసుగా మారిపోయారని జిగ్నేశ్ మేవానీ తెలిపారు.

ఇతరులతో కలిసి పనిచేసేందుకు సిద్దమన్న జిగ్నేశ్

ఇతరులతో కలిసి పనిచేసేందుకు సిద్దమన్న జిగ్నేశ్

‘దళితులు, ముస్లింలు గుజరాత్ రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రభావితం చేయనున్నారు. గుజరాత్‌లో దళితులు ఏడు శాతం మంది ఉన్నా రాజకీయంగా కీలకం కాకపోయినా దేశ వ్యాప్తంగా 17 శాతం జనాభా ఉంటుంది' అని జిగ్నేశ్ మేవానీ తెలిపారు. హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పోక్ ఠాకూర్ కలిస్తే ఉమ్మడి లక్ష్యానికి చేరుకోగలమని తెలిపారు. పటేళ్లు, ఇతర ఓబీసీలతో దళితులకు సమస్యలు ఉన్నా, దళితులు వారిలో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని జిగ్నేశ్ మేవానీ చెప్పారు. ఇతర అగ్ర కులాల వారి నుంచి అక్రుత్యాలు, వివక్షతో దళితులు సైతం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వ్యూహం బయటపెట్టని అల్పేశ్ ఠాకూర్

వ్యూహం బయటపెట్టని అల్పేశ్ ఠాకూర్

ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉధ్రుత స్థాయికి చేరుకున్న పాటిదార్ల ఆందోళనపై ఓబీసీలు ఆగ్రహిస్తున్నారు. ఈ తరుణంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల (ఓఎస్సెస్) ఎక్తా మంచ్ అండ్ క్షత్రియ ఠాకూర్ సేన కన్వీనర్ అల్పేశ్ ఠాకూర్ తన రాజకీయ వ్యూహమేమిటో బయట పెట్టడం లేదు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడైన అల్పేశ్ ఠాకూర్ 2016లో జరిగిన ఓబీసీల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భారీ స్థాయిలో లిక్కర్ డెన్లపై దాడులకు పాల్పడ్డారు. గ్లాంబ్లింగ్ కేంద్రాలను విధ్వంసం చేశారు. ఈ నెల 23న గాంధీనగర్‌లో జరిగే జనాదేశ్ సమ్మేళనంలో తన రాజకీయ ప్రణాళికతోపాటు తన భవిష్యత్ ప్రణాళికలను బయటపెడతామని చెప్పారు.

యంగ్ టర్క్‌లతో కాంగ్రెస్ పార్టీ ఇలా చర్చలు

యంగ్ టర్క్‌లతో కాంగ్రెస్ పార్టీ ఇలా చర్చలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మహా కూటమి ఏర్పాటుపై ద్రుష్టి సారిస్తున్నది. వచ్చేనెల మొదటి వారంలో గుజరాత్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీన్ని ఖరారు చేయనున్నారు. శరద్ యాదవ్ సారథ్యంలోని యునైటెడ్ జనతాదళ్ గ్రూపు నాయకుడు ఛోటు వాసవ, పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్, ఓబీసీ నాయకుడు అల్పేశ్ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీలతో ఈ మేరకు చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

మహా కూటమి ఏర్పాటు యత్నాలపై ఇలా చర్యలు

మహా కూటమి ఏర్పాటు యత్నాలపై ఇలా చర్యలు

గత ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు అనుకూలంగా ఓటేసిన చోటు వాసవ.. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి అశోక్ గెహ్లాట్, గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్ సోలంకిలతో చర్చించారు. గుజరాత్ రాష్ట్రంలో పేరొందిన గిరిజన నాయకుడు వాసవ. జూలైలో బీహార్ రాష్ట్రంలో నితీశ్ కుమార్.. తిరిగి బీజేపీతో జత కట్టిన తర్వాత వాసవను గుజరాత్ జేడీయూ అధ్యక్షుడిగా శరద్ యాదవ్ నియమించారు.

English summary
Ahmedabad: Over the past couple of years, three young leaders from the Patidar, OBC and Dalit communities have made quite an impact in Gujarat, so much so that the state BJP is worried and making notes to tackle them. While Hardik Patel, convener of the Patidar Anamat Andolan Samiti (PAAS) and Jignesh Mevani, convener of the Rashtriya Dalit Adhikar Manch have openly declared their anti-BJP stand, Alpesh Thakor, convener of the Kshatriya Thakor Sena, is yet to reveal his cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X