Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2018 మిజోరాం ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన‌ అభ్యర్థులు వీరే

మిజోరాంలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులు తమ రాజకీయ వ్యూహాలను ప్రదర్శించారు. నవంబర్ 7 పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి వాతావరణం మరింత వేడెక్కుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జోరంతంగా నేతృత్వంలోని అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)తోపాటు జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మరియు కాంగ్రెస్ మధ్య మిజోరాం రాష్ట్రంలో ఈసారి తీవ్రమైన పోటీ ఉండబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మిజోరంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్ చిత్తుచేసింది. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. ఐజ్వాల్ వెస్ట్ లీ నుండి పోటీ చేసిన MNF అభ్య‌ర్థి లాల్రుత్‌కిమా 2,720 ఓట్ల (మార్జిన్ శాతం - 16.2 శాతం) మార్జిత్‌తో విజ‌యం సాధించారు. మొత్తం 19,723 ఓట్లకుగానూ 16,836 ఓట్లు త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఐజ్వాల్ ఈస్ట్ I సీటు నుంచి పోటీ చేసిన MNF ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి జోరంతంగా 21,253కి గానూ ఏకంగా 19,488 ఓట్లు 12.8 శాతం మార్జిన్‌తో గెలుపొందారు.

These are the candidates who won the highest majority in the 2018 Mizoram elections

సియాహా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎన్‌ఎఫ్‌కు చెందిన డాక్టర్ కె బీచువా 2,468 (మార్జిన్ శాతం - 12.8 శాతం) మార్జిన్‌తో గెలుపొందారు. 20,316 ఓట్ల‌కుగానూ 16,236 గెలుచుకున్నారు. లుంగ్లీ సౌత్ నుండి ప్రాతినిధ్యం వహించిన కె పచ్చుంగా 2,441 ఓట్ల (మార్జిన్ శాతం - 16.9 శాతం) ఆధిక్యతతో ఎన్నికయ్యారు. మొత్తం 16,482 ఓట్లకు గాను 14,461 ఓట్లు సాధించారు.

అధికార‌పోరు ఈనాటిది కాదు : లుంగ్లీ జిల్లాలోని వెస్ట్ టుయిపుయ్ స్థానం నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన నిహార్ కాంతి చక్మా మొత్తం 13,963 ఓట్లకు గాను 12,847 ఓట్లతో గెలుపొందారు. మార్జిన్ 2,385 (మార్జిన్ శాతం - 18.6 శాతం). అప్ప‌టి మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా పోటీచేసిన‌ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. చంఫాయి సౌత్, సెర్ఛిప్ నియోజకవర్గాల్లో ఆయ‌న‌ పోటీచేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. మొత్తం ఇక్క‌డ 40 స్థానాలు అయినా త్రిముఖ పోరు ఉండ‌బోతోన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే బీజేపీ కొన్ని స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టినప్ప‌టికీ పోటీ మాత్రం ఎంఎన్ ఎఫ్‌, కాంగ్రెస్‌, ఎడ్ పీఎం మ‌ధ్యే అనేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. నిజానికి కాంగ్రెస్‌, ఎంఎన్ ఎఫ్ మ‌ధ్య అధికార పోరు 1989 నుంచే కొన‌సాగుతూ వ‌స్తోంది. అంతేకాదు, ఒకేపార్టీ రెండుసార్లు అధికారంలోకి రావ‌డం మిజోరాంలో రివాజుగా వ‌స్తోంది. మ‌రి ఈసారి ఏం జ‌రుగుతోందో మ‌రికొన్ని రోజుల్లోనే తేల‌బోతోంది. ఈసారి రాష్ట్రంలో ఒకే దశలో నవంబర్ 7న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు జ‌రగ‌నుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+