వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత పార్లమెంటులో బడ్జెట్ 11గంటలకే ఎందుకు ప్రవేశపెడుతారు?

ఆ ఆనవాయితీని పక్కనబెట్టి 2001లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమయాన్ని ఉదయం 11గం. కు మార్చారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో.. 1947 నవంబర్ 26న ఆర్కే షన్ముఖం చెట్టి తొలి బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. ఆరోజు సాయంత్రం 5గం.కు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.

ఆనాటి నుంచి 2000సం. వరకు ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి పనిదినం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తున్నారు. నాటి బ్రిటీష్ పాలకుల కాలం నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది.భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెడితే... బ్రిటిష్ పార్లమెంటు అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం కల్లా దానికి ఆమోదం తెలిపేది.

Why central budget is On 11am only?

దేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. అయితే ఆ ఆనవాయితీని పక్కనబెట్టి 2001లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమయాన్ని ఉదయం 11గం. కు మార్చారు. ఇక అప్పటి నుంచి ఆర్ధిక మంత్రులందరు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గమనార్హం. స్వతంత్ర భారత చరిత్రలో ఫిబ్రవరి మొదటి పనిదినాన బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

English summary
Its an interesting matter on central budget that why it is introduced into parliament on 11am only
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X