వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తరిమెల దారిలో కిరణ్: రాజీనామాపై ఉత్కంఠ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనే ఉత్కంఠ పలువురిలో కనిపిస్తోంది. రాష్ట్రంలో 1969 నాటి శాసనసభలో నెలకొన్న సీనియర్ సభ్యుని రాజీనామా సీన్ నేటి సభలో మళ్లీ రిపీట్ అవుతుందా? నాడు తరిమెల నాగిరెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం మళ్లీ శాసనసభలో ఆవిష్కృతం కానుందా? కిరణ్ కూడా శాసనసభ సమావేశాల సందర్భంగా చివరి రోజున కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందా? అన్న చర్చ సాగుతోంది.

నాడు వరుసగా మూడుసార్లు అనంతపురం జిల్లా నుంచి శాసన సభ్యునిగా ఎన్నికైన తరిమెల నాగిరెడ్డి మూడోసారి సభ్యునిగా కొనసాగుతూనే రాష్ట్రంలో అభివృద్ధి జరగని తీరు, ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇతర అరాచకాలు వంటి అనేక అంశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పదవీకాలం మధ్యలోనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Will Kiran Reddy resign?

దీనిపై నేరుగా శాసనసభలోనే సుదీర్ఘ ప్రసంగం ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, జనం కోసం ఏమీ చేయలేకపోయానన్న భావనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా పెను సంచలనమే సృష్టించారు. రాజీనామా ప్రకటనకు కారణాలు చెప్పేందుకు అప్పట్లో శాసనసభ స్పీకర్ కూడా తరిమెలకు అనుమతి ఇచ్చారు.

ఇప్పుడు కూడా విభజన అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కిరణ్ కూడా ఇదే శాసనసభ సమావేశాల్లో ఏదో ఒక రోజు కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. 1967లో మూడోసారి ఎన్నికైన నాగిరెడ్డి కేవలం రెండేళ్లలోనే తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై అనేకసార్లు సభ్యునిగా ప్రస్తావించినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ప్రయోజనాలు కలగలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా విభజన నేపథ్యంలో ప్రజా సమస్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలకు నష్టం కలుగుతుందంటున్నారు. తన ప్రసంగాల్లో కూడా ఇవే అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు తెలంగాణ విభజనను అంగీకరించేది లేదని పదేపదే చెబుతున్నారు. సభలోనే రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. ఈ సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమన్నారు.

దీంతో ఆయన రానున్న కాలంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలను 30వ తేదీ వరకు పొడిగించారు. ఆ తరువాత ఓట్ ఆన్ అకౌంట్ కోసం ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. అవి పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారని అంటున్నారు. అయితే ఈ రాజీనామా అన్నది తెలంగాణ బిల్లు చర్చ సందర్భంగా చివరి రోజున ఉంటుందా లేక ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాల చివరి రోజున ఉంటుందా అన్న దాని పైన కూడా ఉత్కంఠ నెలకొంది.

English summary
It is said that Chief Minister Kiran Kumar Reddy may resign for his post after debate on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X