• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎవరితో?: బాబు దీక్షతో క్లియర్, జగన్‌కు లెఫ్ట్ రైట్!

By Srinivas
|
Will TDP go with BJP?
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఒక్కటిగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఆరు రోజులపాటు నిరాహర దీక్ష చేసినా భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు సంఘీభావం తెలపలేదు. మరోవైపు ఎపి బిజెపి నేతలు టిడిపితో పొత్తు ఉండదని, తాము ఒంటరిగానే 2014 ఎన్నికలకు వెళ్తామని ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బిజెపి, టిడిపిల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతోందని అంటున్నారు. ఎన్నికల వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలన్న ఉద్దేశంతోనే ఇరుపార్టీల నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఢిల్లీ దీక్షకు బిజెపి నేతలు వెళ్లకున్నా, తెలుగుదేశం పార్టీని సంతృప్తి పరిచేందుకే బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఇటీవల ప్రకటనలు చేశారంటున్నారు.

తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నామని అయితే, రాష్ట్రంలో రెండు ప్రాంతాల పట్ల సమాన దృక్పథంతో వ్యవహరించాలని రాజ్‌నాథ్, వెంకయ్యలు కోరారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు దీక్ష విరమించాలని అభ్యర్థించడం కేవలం వ్యూహాత్మకమేనని అంటున్నారు.

తెలంగాణ ప్రాంతానికి తప్పుడు సంకేతాలు పంపకుండా ఉండేందుకు ఇద్దరి పేర్లూ ప్రస్తావించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలుత రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా బాబు దీక్షకు వెళ్లి పరామర్శించాలని నిర్ణయించుకునప్పటికీ తెలంగాణ ప్రాంతానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలంగాణకు చెందిన నేతలు ఆయనను వారించారట. అదే సమయంలో కాంగ్రెస్, తదితర పార్టీల నుంచి బిజెపిలో చేరాలనుకున్న పలువురు నాయకులు వెనుకంజ వేస్తారని వారు చెప్పినట్లు తెలిసింది.

టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఇంకా సమయం ఉన్నందున, ఎప్పుడో ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పుడే ప్రకటించవద్దని, అప్పటికి తెలంగాణపై స్పష్టత ఏర్పడుతుందని తెలంగాణ బిజెపి నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పారంటున్నారు. అంతేకాకుండా బాబు దీక్షతో భావి రాజకీయ సమీకరణాల విషయంలో కూడా స్పష్టత ఏర్పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. టిడిపికి ఒకప్పటి మిత్రపక్షాలైన సీపీఐ, సిపీఎం ఈసారి బాబుకు దూరంగా ఉన్నాయి.

సెప్టెంబర్ నెలాఖరులో లౌకికవాద సదస్సుకు రావాలని సిపీఎం నేత ప్రకాశ్ కారత్ స్వయంగా బాబుకు ఫోన్ చేసి ఆహ్వానించినప్పటికీ ఇప్పుడు అలాంటి సదస్సులు అవసరం లేదని బాబు సున్నితంగా తిరస్కరించారట! అయితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభకు వెళ్లి ఆయనను పొగిడి, ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం వామపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ సాదరంగా ఆహ్వానించడం గమనార్హం.

English summary
Even as UPAs decision to bifurcate AP has let to a political flux, its arch - rival waiting to occupy the throne in Delhi, the BJP, is confronted with a hamletian dilemma to ally with the TDP or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X