Gandhi Jayanti 2021:బాపు సూక్తులే నేటి పాలకులకు మార్గాలు -అవే అసలైన పాలనకు మార్గదర్శకాలు
మహాత్మా గాంధీ... ఈ పేరు వింటే అహింసా, అఖండ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం గుర్తుకువస్తాయి. దేశాన్ని బ్రిటీషు పాలకుల నుంచి విముక్తి చేయడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా అహింసా మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. ఆయన నమ్మిన అహింసా సిద్ధాంతంతోనే తెల్లదొరలను తరిమి కొట్టారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. 2021 అక్టోబర్ 2కు గాంధీజీ 152వ జయంతి. తాను చూపిన అహింసా మార్గంను ఆచరించడంతో 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం దక్కింది. బాపూగా పేరుగాంచిన గాంధీ తాను ఎన్నో బోధనలు చేశారు. నేటికీ ఆయన నేర్పిన మాటలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. దేశం గాంధీ 152వ జయంతి జరుపుకుంటున్న వేళ ఆ మహాత్ముడు చెప్పిన కొన్ని ఆదర్శవంతమైన మాటలను గుర్తు చేసుకుందాం.

* బలహీనుల్లో ఎప్పటికీ క్షమించే గుణం ఉండదు, బలవంతులు మాత్రమే క్షమించే గుణం కలిగి ఉంటారు
* కన్నుకు కన్ను అనే సిద్ధాంత మొత్తం ప్రపంచాన్నే అంధకారంలోకి నెట్టివేస్తుంది
* మనిషి ఆలోచనలను ఉత్పత్తి చేస్తాడు. ఆ ఆలోచనల నుంచే ఏం కావాలో అది అవుతాడు
* నా అనుమతి లేకుండా ఎవరూ నన్ను గాయపరచలేరు
* నీ ఆలోచన విధానం, నీ మాట, నీ క్రియలు మూడు సమానంగా ఉంటేనే ఆనందం ఉంటుంది
* ఒకరికి సేవ చేయడంలోనే ఆత్మ సంతృప్తి దక్కుతుంది.
* ఒక పని చేయాలన్న బలమైన ఆలోచన ఉంటే.. అందుకు కావాల్సిన సామర్థ్యం నీ దగ్గర బయటపడుతుంది.
* బలం భౌతిక సామర్థ్యం నుంచి రాదు. ఇది లొంగని సంకల్పం నుండి వస్తుంది
* మీ చర్యల ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో మీకు తెలియదు.. కానీ అసలు ఏమీ చేయకుండానే ఉంటే ఫలితమే ఉండదు
* శాంతి మంత్రాన్ని పాటిస్తూనే ప్రపంచాన్ని గెలవగలవు
* సహనం నశించడమంటే యుద్ధం ఓడినట్లే
* బలవంతుల ఏకైక ఆయుధం అహింసా
* తప్పులు చేసే స్వేచ్ఛ లేకుంటే స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఉండదు
* వెయ్యి తలల కంటే మానవత్వంతో చేసే ఒక్క ప్రార్థన బలమైనది
* మానవత్వంపై ఎప్పటికీ విశ్వాసం కోల్పోరాదు. మానవత్వం అనేది ఒక మహా సముద్రం. ఒక మహా సముద్రంలో కొన్ని చుక్కలు మలినమైనంత మాత్రానా మొత్తం మహా సముద్రం మలినం అయినట్లు కాదు
* ఆలోచన, మాట, క్రియ ఈ మూడు సామరస్యత కలిగి ఉండాలి. ఆలోచనలు పవిత్రంగా ఉండాలి అప్పుడే అంతా బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది
* శాంతికి మార్గం లేదు.. ఉండేదంతా శాంతి మాత్రమే
* నన్ను గొలుసులతో కట్టేయొచ్చు, నన్ను హింసించొచ్చు, నా శరీరాన్ని ధ్వంసం చేయొచ్చు, కానీ నా ఆలోచనను మాత్రం బంధించలేరు.
* పాపాన్ని ద్వేషించండి.. పాపాత్ముడిని ప్రేమించండి
* ప్రత్యర్థిని ఎదుర్కొన్నప్పుడు అతన్ని ప్రేమతో గెలిచేందుకు ప్రయత్నించండి
* ప్రపంచం చూడాలనుకుంటున్న మార్పుగా ఉండేందుకు ప్రయత్నించండి
* ఈ రోజు మీరు చేస్తున్న క్రియలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది












Click it and Unblock the Notifications