విద్యార్థులకు శుభవార్త... పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు..
విద్యార్థులకు శుభవార్త.. రెండు తెలుగు రాష్ట్రాలు రేపు పాఠశాలలకు కళాశాలలకు సెలవు ప్రకటిచేంశాయి. రేపు (ఆగస్టు 26న) శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉంది. సోమవారం పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, పండుగ సందర్భంగా రేపు అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సైతం రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చేసాయి. ఈ నెలలో ముఖ్యమైన పండుగలతో పాటు ఆదివారాలు కూడా ఉండటంతో వరుస సెలవులే సెలవులు. ఇప్పటికే ఈ నెల (ఆగస్టు) 18వ తేది ఆదివారం కాగా, ఆ మరుసటి రోజు 19వ తేది రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవులు వచ్చాయి. వీటితో పాటు ఆగస్టు 24వ తేదీన నాలుగో శనివారం కాగా, 25న ఆదివారం, 26న కృష్ణాష్టమి పండుగ సందర్భంగా వరుస సెలవులు వచ్చేసాయి.. 25, 26 తేదీల్లో ప్రభుత్వం పబ్లిక్ హాలీడేలుగా ప్రకటించేసింది. ఆగస్టు 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.













Click it and Unblock the Notifications