తెలుగు రాష్ట్రాల్లో ఇక వర్షాలే వర్షాలు..మరో ఐదు రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక అప్‌డేట్‌ను అందించింది. రాబోయే మరో ఐదురోజులు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేడు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా మొన్నటి వరకు కనిపించకుండా అసలు వర్షాలే పడలేదు. గత రెండు మూడు రోజులు నుంచి వీపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు వరుణుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అధికారుల సూచనలు..
సోమవారం హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. ఇక నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులుగా మారాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు అధికారులు ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక, జులై 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఈ నెల 19వ తేదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో..మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలుకు రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని అల్లూరి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications