రానున్నరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలితీవ్రత..
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి. దీంతో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితిలు దాపురించాయి. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. పడుతున్నారు. ఇక, రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత పెరిగే అకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్‌లో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడే అవకాశాలున్నాయి.
ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోయాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. కానీ, ప్రస్తుతం 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. తెలంగాణలోని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వాతవరణం క్రమంగా చల్లగా మారుతూ ఉంది. రాత్రిపూట కాకుండా పగలు కూడా విపరీతమైన చలితో ప్రజలు గజగజవణికిపోతున్నారు. ఇంకా వచ్చే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణవైపుగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతవరణం ఏర్పాడే అవకాశం ఉందని సమాచారం. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం ఉష్ణోగ్రతల విషయంలో అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక, మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఏదిఏమైనా రానున్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే..












Click it and Unblock the Notifications