మిచాంగ్ తుఫాన్ కారణంగా 142 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే...
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే, దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రానున్న 3-4 రోజుల పాటు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. మిచాంగ్ తుఫాను డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారుల అంచనా. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
నేడు రద్దుచేసిన రైళ్ల వివరాలు ఇవే : భువనేశ్వర్-బెంగళూరు (12845), విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708), పూరి-చెన్నై (22859), టాటానగర్-ఎర్నాకులం (18189), సంత్రాగచ్చి-తిరుపతి (22855), గౌహతి-బెంగళూరు (12510), నాగర్‌కోయిల్-షాలిమర్ (12659), హటియా-బెంగళూరు (12835), హౌరా-చెన్నై మెయిల్ (12839), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), హౌరా-బెంగళూరు (12863), హౌరా-పాండిచ్చేరి (12867), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351),

డిసెంబర్ 4 సోమవారం రద్దయిన రైళ్ల వివరాలు ఇవే : బెంగళూరు-భువనేశ్వర్ (12846), కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487), విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707), చెన్నై-పూరి (22860), విశాఖ-చెన్నై (22860), గుహవటి-బెంగళూరు (12510), హౌరా-చెన్నై మెయిల్ (12839), చెన్నై-హౌరా మెయిల్ (12840), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), చెన్నై-షాలిమార్ కోరమండల్ (12842), హౌరా-బెంగళూరు (12863), బెంగళూరు-హౌరా (12864), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351), ముజాఫర్‌పూర్-బెంగళూరు (15228), తంబరం-సిలిఘాట్ (15629), ఎర్నాకులం-పాట్నా (22643), హటియా-ఎర్నాకులం (22837), సంత్రాగచ్చి-తంబరం (22841), తిరుపతి-సంత్రాగచ్చి (22856), హౌరా-బెంగళూరు (22863) రద్దు
డిసెంబర్ 5 మంగళవారం రద్దయిన రైళ్లు ఇవే : విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488), చెన్నై-విశాఖ (22870), బెంగళూరు-హౌరా (12246), బెంగళూరు-గౌహతి (12509), బెంగళూరు-హటియా (12836), చెన్నై-హౌరా మెయిల్ (12840), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), చెన్నై-షాలిమార్ కోరమండల్ (12842), ఎర్నాకులం-టాటానగర్ (18190), బెంగళూరు-హటియా (18638), విల్లుపురం-ఖరగ్‌పూర్ (22604) రద్దు.
డిసెంబర్ 6 బుధవారం రద్దయిన రైళ్ల వివరాలు : కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487), కోయంబత్తూర్-బరౌని (03358), బెంగళూరు-గౌహతి (12509), షాలిమార్-నాగర్‌కోరుల్ (12660), చెన్నై-హౌరా మెయిల్ (12842), పుదుచ్చేరి-హౌరా (12868), అలెప్పీ-ధన్‌బాద్ బొకారో (13352), కన్యాకుమారి-డిబ్రుగర్ (22503), ఎర్నాకులం-హటియా (22838), తంబరం-సంత్రాగచ్చి (22842), బెంగళూరు-హౌరా (22864) రద్దు.
డిసెంబర్ 7 గురువారం రద్దయిన రైళ్ల వివరాలు : కన్యాకుమారి-డిబ్రుగర్ (22503), ఖరగ్‌పూర్-విల్లుపురం (22603), పాట్నా-ఎర్నాకులం (22643), బెంగళూరు-ముజాఫర్‌పూర్ (15227), అలెప్పీ-ధన్‌బాద్ బొకారో (13352) రద్దు. డిసెంబర్ 8న సిలిఘాట్-తంబరం (15630) రద్దు చేశారు. ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ గమ్యస్థానాల మధ్య కూడా అనేక రైళ్లను రద్దుచేయడం జరిగింది. విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌లను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications