వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు మహిళ అధ్యక్షురాలిగా రోజా పరాజ     లోగుట్టు    తెలుగుమహిళ అధ్యక్షురాలిగా రోజాపరాజయాలతోనిస్తేజంగా ఉన్న

By Staff
|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోవైఎస్‌- కెసిఆర్‌ల మధ్య జరిగిన చర్చలలోగుట్టును సినీనటి విజయశాంతి బాగా విశ్లేషించారు. రాజకీయాల్లోకికొత్తగా వచ్చిన ఆమె బిజెపి, టిడిపి నాయకుల కంటే మెరుగ్గామాట్లాడడంఆశ్చర్యం కలిగించింది. వైఎస్‌-కెసిఆర్‌మధ్య చర్చల్లో తెలంగాణ రాష్ట్రంఏర్పాటు అంశం ఎందుకు చర్చకురాలేదని ఆమె ప్రశ్నించారు. దీనిని బట్టి చంద్రశేఖరరావు కాంగ్రెస్‌తోకుమ్మక్కయ్యారని భావించవలసిఉంటుందన్నారు. ఈ దొంగనాటకం చూస్తుంటేరెండో ఎస్సార్సీకి చంద్రశేఖరరావుఅంగీకరించి, ఎన్నికల ముందే సంతకాలుపెట్టారని రూఢీ అవుతోందని ఆమె అన్నారు.తెలంగాణ ప్రజలను వంచించాలని టిఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని దీనినిప్రజలు సహించబోరని ఆమె అన్నారు. ఆమెఇంత స్పష్టంగా మాట్లాడడం రాజకీయపరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఆమె మాటలుటిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా కంగారుపుట్టించేలా ఉన్నాయి. ఇంత కాలం సినిమాఫక్కీలో ఆవేశంగా సబ్జెక్ట్‌ నాలెడ్జిలేకుండా మాట్లాడిన ఆమె ఇలా పరిణతి చెందడంచాలా మందికి ప్రమాదకరమే కావచ్చు.

చంద్రబాబుపప్పుబెల్లాలపై సమీక్ష

చంద్రబాబునాయుడు హయాంలో జరిగినట్టు చెబుతున్నప్రధాన అక్రమాలపై ఇంతవరకుముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమీక్షజరపలేదు. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ రంగ సంస్ధలనుప్రైవేటు పరం చేయడంలో దాదాపు 500 కోట్లరూపాయలు చేతులు మారాయన్నదికాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రముఖంగా చేస్తున్న ఆరోపణ. అధికారంలోకి వచ్చిన14 నెలలైనా వీటిపై సమీక్షజరపకపోవడం వల్ల కాంగ్రెస్‌ శ్రేణులకు తప్పుడు సంకేతాలువెళ్తాయని భయపడిన ముఖ్యమంత్రిఅమ్మేసిన ప్రభుత్వ రంగసంస్ధలకుసంబంధించిన ఫైళ్ళనుతెప్పించుకున్నారు. పి.జనార్ధనరెడ్డివంటి కార్మిక నాయకులు ఈ విషయాన్నిఅనేకసార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. కొన్నికార్పొరేట్‌ సంస్ధలకు చంద్రబాబు నాయుడు కారుచౌకగాభూములను విక్రయించిన విషయంపై కూడాసమీక్షజరగాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. వోక్స్‌వ్యాగన్‌ ఊబినుంచి,టిఆర్‌ఎస్‌ దాడి నుంచి బయటపడినరాజశేఖరరెడ్డి ఇక పరిపాలనా విషయాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు.

సీనియర్లకుఅల్లం, జూనియర్లకు బెల్లం

రాష్ట్రమంత్రి ఎం.సత్యనారాయణ రావుకు నచ్చిన శాఖ ఇన్నిడ్రాల అనంతరం కూడారాలేదు. నిన్న పంచిన అదనపు శాఖల్లోసత్యనారాయణరావుకు సినిమాటోగ్రఫీశాఖ వచ్చింది. దేవాదాయ భూములఅమ్మకంలో అవకతవకల దరిమలామంత్రి పదవికి మొదటిసారి ఆయనరాజీనామా చేయగా, ఆయనను బుజ్జగించి శాఖమార్చారు. సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖలను కేటాయించడంపై ఆయనగుర్రుగా ఉన్నప్పటికీ కొన్ని రోజులు భరించారు. రెండోసారి ఆయన రాజీనామాచేయగా మళ్ళీ వైఎస్‌ రాజీచేసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడాఎమ్మెస్‌ రాజీనామా చేయాలనుకుంటున్నతరుణంలో అదనపు శాఖల పందేరంజరిగింది. ఇప్పుడైనా మంచి ప్రాధాన్యం ఉన్న శాఖదక్కుతుందని ఆశించిన ఈ భీష్మాచార్యుడికినిరాశే మిగిలింది. రోశయ్య కూడా తనకు దక్కిన అదనపు శాఖతో సంతృప్తిగాలేరని వార్తలు వస్తున్నాయి. ప్రాధాన్యంగల శాఖలను జూనియర్లకు కేటాయించడంద్వారా ముఖ్యమంత్రి ఆ శాఖలపై పెత్తనం చేయాలనుకుంటున్నారని అసంతృప్తిజీవుల ఆరోపణ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X